Chiyaan Vikram : తంగలాన్ మూవీ కోసం చియాన్ విక్రమ్ ఇంత కష్టపడ్డాడా..?

- Advertisement -

Chiyaan Vikram : ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో క‌ల్కి, గేమ్ ఛేంజర్ ల‌తో పాటు త‌మిళం నుంచి చియాన్ విక్ర‌మ్ తంగ‌లాన్, సూర్య కంగువ కూడా ఉన్నాయి. ముఖ్యంగా విక్రమ్ తంగలాన్ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. ఇక త్వరలోనే తంగలాన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17వ తేదీ చియాన్ విక్రమ్ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని చిత్ర‌బృందం ఒక ప్ర‌త్యేక వీడియోని షేర్ చేసింది.

Chiyaan Vikram
Chiyaan Vikram

ప్రస్తుతం ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో విక్రమ్ తన పాత్ర తాలూకా హావ‌భావాలు, వేష‌ధార‌ణ కోసం ఎంత‌గా శ్ర‌మించారో కనిపించింది. ఈ వీడియో చూస్తే సినిమాలంటే విక్రమ్ కు ఎంత డెడికేషన్ ఉందో అర్థమైపోతుంది. విక్రమ్ లుక్, లాంగ్వజ్, అట్టైర్, కాస్ట్యూమ్, మేకప్ ఇలా ప్రతి దాంట్లో వైవిధ్యం కనిపిస్తోంది. పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే చిరస్మరణీయం కానుందనే విషయం వీడియో చూస్తే తెలుస్తోంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక సాహస కథను జియో స్టూడియోస్, స్టూడియో గ్రీన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తాజాగా మేకర్స్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్ర‌మ్ స‌ర్ కి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇది అని ద‌ర్శ‌కుడు పా రంజిత్ అన్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించగా.. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ క‌థానాయిక‌లుగా నటించారు. పశుపతి, హరి కృష్ణన్, డేనియల్ కాల్టాగిరోన్, ప్రీతి కరణ్, వెట్టై ముత్తుకుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి జ్యోతి దేశ్‌పాండే – పా రంజిత్ – జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తంగలన్ అతి త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. మీరూ ఈ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టాన్ని ఓసారి చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here