Veera Simha Reddy Vs Waltair Veerayya : తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తూ వస్తుంది..స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యి వారం పైన కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు.. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు.. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ కొట్టేశారు. ఫ్యాన్స్ అయితే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చూసి అసలైన పండగ చేసుకున్నారు. ఇక తొలి మూడు నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ రెండు మూవీస్ కూడా.. వారం తర్వాత బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తూనే ఉన్నాయి.మొదటి వారం ఆ సినిమాల కలెక్షన్లు మిలిగిన నిర్మాతలకు షాక్ ఇస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ వింటేజ్ లుక్, మాస్ అవతార్ లో కనిపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. కమర్షియల్ ఎంటర్ టైనర్, బ్రదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ సినిమా.. రిలీజైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ.108 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. మరోవైపు బాలయ్యని ఫుల్ యాక్షన్ అవతార్ లో ఆవిష్కరించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య.. తన మార్క్ ఫైట్స్ తో అల్లాడించారు. ఇక అభిమానుల ఆనందానికైతే హద్దుల్లేకుండా పోయింది. ఈ మూవీ కూడా తొలి నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల గ్రాస్ సాధించిందని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఏ సినిమా ఎన్నెన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..
నైజాం రూ 25.92 కోట్లు
సీడెడ్ రూ 14.61 కోట్లు
ఉత్తరాంధ్ర రూ 11.34 కోట్లు
ఈస్ట్ రూ 8.25 కోట్లు
గుంటూరు రూ 6.20 కోట్లు
కృష్ణ రూ 5.92 కోట్లు
నెల్లూరు రూ 3.01 కోట్లు
వెస్ట్ రూ 4.61 కోట్లు
ఆంధ్రా-తెలంగాణ 7 రోజుల కలెక్షన్స్ – రూ 79.86 కోట్ల షేర్ (రూ 129.10 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 6 కోట్లు
ఓవర్సీస్: రూ 10.60 కోట్లు
వరల్డ్ వైడ్ 7 రోజుల వసూళ్లు: రూ 96.46 కోట్ల షేర్ (రూ 165.45 కోట్లు గ్రాస్) అని తెలుస్తుంది..
వీరసింహారెడ్డి కలెక్షన్స్ ను చూస్తే..
నైజాం రూ 15.41 కోట్లు
సీడెడ్ రూ 15.17 కోట్లు
ఉత్తరాంధ్ర రూ 6.41 కోట్లు
ఈస్ట్ రూ 4.94 కోట్లు
వెస్ట్ రూ 3.77 కోట్లు
గుంటూరు రూ 5.97 కోట్లు
కృష్ణ రూ 4.24 కోట్లు
ఆంధ్రా-తెలంగాణ 7 రోజుల కలెక్షన్స్ – రూ 58.51 కోట్ల షేర్ (రూ 94.65 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 4.50 కోట్లు
ఓవర్సీస్: రూ 5.50 కోట్లు..
వరల్డ్ వైడ్ 7 రోజుల వసూళ్లు: రూ 68.51 కోట్ల షేర్ (రూ 114.95 కోట్లు గ్రాస్) అని సమాచారం..
ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక పోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విష్లెషకులు అభిప్రాయ పడుతున్నారు..