JR NTR : ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ఆ అవార్డు రావడం ఎంత ప్రత్యేకతో.. అక్కడి మీడియాతో మన స్టార్లు మాట్లాడిన తీరు.. ఇచ్చిన ఇంటర్వ్యూ అంతే స్పెషల్. ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తర్వాత.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. అందులో తారక్ అక్కడి మీడియాతో వాళ్ల స్లాంగ్‌లోనే.. ప్యూర్ అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడి వాళ్లనే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
తారక్ ఇంగ్లీష్ యాక్సెంట్‌పై అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరేమో ఎన్టీఆర్ స్లాంగ్‌ని మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ చర్చపై తాజాగా తారక్ స్పందించాడు. తనపై.. తన యాసపై వచ్చిన విమర్శలకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కమ్ రిప్లై ఇచ్చాడు. మరి తారక్‌తో అంత మామూలుగా ఉండదు కదా..? ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నాడో చూద్దామా..?
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికగా తన యాసను విమర్శించిన వారికి పరోక్షంగా సమాధానం ఇచ్చారు నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒక్కో దేశంలో ఒక్కో యాస ఉండటం సహజమని అన్నారు. ‘‘కాలమానం, యాసల పరంగానే మన మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. కానీ, పశ్చిమ దేశాల్లో ఒక నటుడు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో తూర్పు దేశాల్లోనూ అదే విధంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
‘నాటునాటు’ కు గోల్డెన్ గ్లోబ్ వచ్చిన సందర్భంగా ఓ హాలీవుడ్ పత్రికకు ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించారు.ఇదే ఇంటర్వ్యూలో ఆయన రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి గొప్ప వ్యక్తి. తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించిన వ్యక్తి. ప్రతి చిత్రంతో ఆయన మరింత వృద్ధి చెందుతున్నారు. పశ్చిమ దేశాల్లోనూ పేరు సొంతం చేసుకునేలా ఆయన చేసిన ఆలోచన ‘ఆర్‌ఆర్‌ఆర్’. దక్షిణాదిలోని టాలీవుడ్ అనే చిన్న పరిశ్రమకు చెందిన మేము.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కారణంగా ఈ స్థాయికి చేరుకోవడం.. ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా పేరు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ – రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మన వారినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులనూ అలరించింది.
ఇటీవల ఈ చిత్రంలోని ‘నాటు నాటు’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్రబృందం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ను రెడ్ కార్పెట్‌పై ఓ హాలీవుడ్ యాంకర్ ఇంటర్వ్యూ చేయగా.. ఆయన అమెరికన్ ఇంగ్లిష్ యాక్సెంట్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. దీనిని చూసిన పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.