Cinema Gossips : స్టార్ క్రికెెటర్ తో బాలీవుడ్ బ్యూటీ పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే..?

- Advertisement -

Cinema Gossips : క్రికెట్-సినిమా ఇండియాలో ఈ రెండింటికి విడదీయరాని అనుబంధం ఉంది. జనం కూడా ఈ రెండింటి కోసం ఏమైనా చేస్తారు. క్రికెట్, సినిమాలకు ఫ్యాన్స్ కాదు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అభిమానులకే కాదు.. ఈ రంగాల్లో ఉన్న ప్రముఖులకు కూడా ఓ సాలిడ్ రిలేషన్ ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్- బాలీవుడ్ రిలేషన్ రాక్ సాలిడ్ గా ఉంటుంది. 

Cinema Gossips
Cinema Gossips

చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ ఇండియన్ క్రికెటర్లతో ప్రేమాయణం నడిపారు. కొందరి ప్రేమలు గ్రౌండ్ వరకే పరిమితమైతే.. మరికొందరి ప్రేమలు పెళ్లి వరకూ వెళ్లాయి. అలా విరాట్ కోహ్లి-అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా- నటాషా, యువరాజ్ సింగ్-హేజల్ కీచ్, హర్భజన్ సింగ్- గీతా బస్రా, జహీర్ ఖాన్- సాగరిక, చాహల్-ధన్య వీళ్లంతా క్రికెట్-బాలీవుడ్ జంటలే. వీళ్లంతా ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఇప్పుడు పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మరో జంట చేరబోతోంది.

Athya Shetty and Sunil SHetty
Athya Shetty and Sunil Shetty

బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో కాస్త సీక్రెట్ గా వీళ్ల రిలేషన్ ను మెయింటైన్ చేసిన ఈ జంట తర్వాత తర్వాత పబ్లిక్ గా తమ ప్రేమను చూపించడం మొదలుపెట్టారు. అలా సోషల్ మీడియాలోనూ పలుమార్లు ఈ లవ్ బర్డ్స్ ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. చాలాసార్లు కలిసి వెకేషన్స్ కు కూడా వెళ్లారు. ఇరువురి ఫ్యామిలీస్ కూడా చాలాసార్లు కలిశాయి. ఇక పెళ్లి ఒకటే లేటు అనుకుంటున్న సమయంలో త్వరలో పెళ్లి అంటూ పుకార్లు మొదలయ్యాయి.

- Advertisement -
Athiya and Rahul
Athiya and Rahul

అయితే ఇప్పుడు అతియా – రాహుల్ జంటకు సంబంధించి ఓ క్రేజీ న్యూచ్ తెలిసింది. తాజాగా ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ – అథియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌లో గట్టిగా టాక్‌ వినిపిస్తోంది. జనవరి 23వ తేదీన వీరి వివాహం సునీల్‌ శెట్టి నివాసం ఖండాలాలో జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ నుంచి సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, జాకీ ష్రూఫ్‌ తదితరులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా క్రీడా రంగం నుంచి ధోనీ, కోహ్లీ వంటి స్టార్‌ క్రికెటర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here