Manchu Manoj : గుడ్​న్యూస్ చెబుతానన్న మంచు మనోజ్.. పెళ్లి గురించేనా..?



మంచు మోహన్​బాబు వారసుడు Manchu Manoj గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మనోజ్ మొదటి వివాహం విఫలం అయింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది.

Manchu Manoj
Manchu Manoj

ఇక మనోజ్ భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికను పెళ్లాడబోతున్నట్లు టాక్ వినిపించింది. ఇద్దరూ కలిసి వినాయక చవితి సందర్భంలో కలిసి పూజలు చేయడంతో ఆ వార్తలకు మరికొంత బలం చేకూరింది. అంతే కాకుండా ఈ పెళ్లి మోహన్​బాబు కుటుంబానికి ఇష్టం లేదంటూ.. ఈ విషయంపైనే వారి కుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనోజ్ తాజాగా చేసిన ట్వీట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ అదేంటంటే..?

Manchu Manoj and bhima mounika

మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వార్తను అందరితో పంచుకుంటానని నటుడు మంచు మనోజ్‌ తెలిపాడు. ఈ మేరకు అతడు బుధవారం ఉదయం ఓ ట్వీట్‌ పెట్టాడు. తన కెరీర్‌లోనే సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దొంగ దొంగది’లోని ‘మన్మథ రాజా’ పాటకు సంబంధించిన జిఫ్‌ వీడియో షేర్‌ చేశాడు.

‘‘నా హృదయానికి చేరువైన ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకొని ఉన్నాను. జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతోన్నందుకు ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటి మాదిరిగానే మీ ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘అన్నా.. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా?’’, ‘‘కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నావా?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కొంతమంది ఆయన రెండో పెళ్లిని ఉద్దేశించే ట్వీట్ చేసిన‌ట్లు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 20న‌ పెళ్లి న్యూస్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని అనుకుంటున్నారు. మ‌నోజ్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. మరి కొందరేమో ఆయన సినిమా రీఎంట్రీ గురించి అయ్యుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి మనోజ్​ చేసిన ఈ ట్వీట్​పై ఆయన స్పందిస్తేనే అసలు విషయం బయటపడుతుంది. కాగా ‘అహం బ్ర‌హ్మాస్మి’ పేరుతో ఓ సినిమాను గతంలో మనోజ్​ అనౌన్స్ చేశారు. కానీ అది మధ్యలోనే నిలిచిపోయింది.