Guntur Kaaram : భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ లేనంత ఎనర్జీ తో పెర్ఫార్మన్స్ చేసాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్ సరిగా లేకపోవడం, నాసిరకపు సన్నివేశాలను పెట్టడం వల్ల, ఈ సినిమా కి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాలో నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి.
డ్యాన్స్ కూడా ఆయన అదరగొట్టేసాడు. త్రివిక్రమ్ కనీసం యావరేజి రేంజ్ కంటెంట్ ఇచ్చినా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా వండర్స్ ని సృష్టించి ఉండేది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒప్పందం ప్రకారం నెల రోజులు పూర్తి అయ్యేవరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యడానికి వీలు లేదట.
కానీ ఇప్పుడు ఈ సినిమాకి టాక్ తేడా కొట్టింది, కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాకపోతే జనవరి 26 వ తేదీన మాకు నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసుకునేందుకు అనుమతిని ఇవ్వాలని, దీనికి అదనంగా ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాము అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కి ఒక ఆఫర్ పెట్టిందట. నాగ వంశీ కూడా అందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.
మరి ఈ సినిమా జనవరి 26 వ తేదీన వస్తుందా లేదా అనేది ఈ సినిమా వసూళ్ల పై ఆధారపడి ఉంటుంది. అయితే తనకి చెప్పకుండా ఈ డీల్ గురించి మాట్లాడినందుకు నిర్మాతపై మహేష్ బాబు ఫైర్ అయ్యాడట. ఈ సినిమా కచ్చితంగా ఆడుతుంది, మన సినిమా మీద మనకి నమ్మకం లేకపోతే ఎలా, కనీసం రెండు రోజులైనా చూడాలి కదా, విడుదల రోజే ఇలాంటివి మాట్లాడేస్తావా అని తిట్టినట్టు తెలుస్తుంది.