Akkineni Nagarjuna : మన తెలుగు సినిమాలో ఎంతో మంది మహానుభావులు, దిగ్గజ నటులు ఉన్నప్పటికీ ఒక్కరికీ కూడా జాతీయ అవార్డు రాకపోవడం శోచనీయం. నిన్న గాక మొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకునే వరకు మన టాలీవుడ్ లో ఒక్కరంటే ఒక్కరికి కూడా నేషనల్ అవార్డు రాలేదు. అప్పట్లో మన తెలుగు సినిమా అంటే నార్త్ ఇండియన్స్ కి చాలా చులకన భావం ఉండేది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం కాస్త గౌరవం ఉండేది కానీ, టాలీవుడ్ లో చిరంజీవి శకం మొదలయ్యాక తక్కువ చూపు చూసేవారు. అప్పట్లో ఎంతో కృషి చేస్తే చిరంజీవి హీరో గా నటించిన ‘రుద్రవీణ’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ బాషా చిత్రం క్యాటగిరీ లో నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ అక్కినేని నాగార్జున నటించిన ‘సంకీర్తన’ అనే చిత్రానికి కూడా నేషనల్ అవార్డు రావాల్సి ఉందట.
అక్కినేని నాగార్జున మరియు రమ్య కృష్ణ కాంబినేషన్ లో గీత కృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఆయన కంపోజ్ చేసిన ఒక్కో పాట, ఒక్కో ఆణిముత్యం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చేందుకు అన్నీ విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ జ్యురీ కి పంపేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపలేదట.
ఈ చిత్రం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న సమయం లో విడుదల అయ్యింది. ఎన్టీఆర్ కి ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వర రావు గారితో అన్నపూర్ణ స్టూడియోస్ విషయం లో గొడవ ఏర్పడింది. అది మనసులో పెట్టుకొనే ఎన్టీఆర్ నాగేశ్వర రావు కొడుకు సినిమాకి నేషనల్ అవార్డు రానివ్వకుండా చేసేందుకు కుట్ర చేసాడని అప్పట్లో ఒక టాక్ ఉండేది.