Ashika Ranganath : నా సామి రంగ.. హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. మెంటలెక్కి పోతారు

- Advertisement -


Ashika Ranganath : నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’ . ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్.. అచ్చ తెలుగు పల్లెటూరి పిల్ల వరలక్ష్మి పాత్రలో ఆకట్టుకోనుంది. ఇక ఈమె నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన ‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్ కు హాజరయ్యేందుకు వస్తే పాల్గొనడానికి అమిగోస్ దర్శకుడు ఫోన్లో కథ చెప్పి ఆమెను ఒప్పించాడట.

Ashika Ranganath
Ashika Ranganath

వాస్తవానికి ఈ బ్యూటీ కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో తన డిగ్రీ పూర్తి చేసింది. అసలు సినిమాల్లోకే వచ్చే ఆలోచనే తనకు లేదట.. కాలేజీ అందాల పోటీల్లో పాల్గొంటే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ గా గుర్తింపు వచ్చిందట. ఆ పోటీలలో ఈమెని చూసిన డైరెక్టర్ కన్నడ సినిమాల్లో అవకాశం ఇచ్చారట. అలా తెరపైకి వచ్చానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Ashika Ranganath Photos

ఇక పునీత్ రాజ్ కుమార్ కి ఆషికా రంగనాథ్ వీర అభిమాని. ఇండస్ట్రీలోకి వచ్చి రాగానే పునీత్ సినిమాలలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోష పడిందట. కాకపోతే ఆయన మరణంతో ఎంతో కృంగిపోయిందట ఈ ముద్దుగుమ్మ. ఆషికాకు తెలుగు బాగానే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచే నాన్నతో కలిసి తెలుగు సినిమాలు చూసేదట. రానున్న కాలంలో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here