Kalki : ‘కల్కి’లో ప్రభాస్ అలాంటి పాత్రలు చేయనున్నాడా.. ఆందోళన పడుతున్న అభిమానులు

- Advertisement -

Kalki : ప్ర‌భాస్ న‌టిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌ సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారని నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారో అని అందరిలో ఆసక్తి మొదలైంది.

ఇటీవల కల్కి మూవీ సెట్స్‌లో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ ప్రభాస్ తో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిక్ లో ప్రభాస్ గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించారు. దీంతో మూవీలో ఆయన లుక్స్ పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రభాస్ పాత్రలకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు టైం పీరియడ్స్ లో డిఫరెంట్ గెటప్స్ లో ప్రభాస్ కనిపించబోతున్నారట.

మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త అయితే వైరల్ గా మారింది. వైజయంతి బ్యానర్స్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాకా రిలీజ్ ని వాయిదా వేశారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి. కాగా ఈ సినిమా ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here