Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతి హాసన్ కథానాయికగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ‘చెంఘీజ్‌ఖాన్ సినిమా చేయడం నా జీవితాశయం’ అంటూ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ తన మనసులోని మాట బయటపెట్టారు. టైం వచ్చిప్పుడు కచ్చితంగా ఈ మూవీ చేస్తానంటూ ఆయన ప్రకటించారు.
బాలయ్య బాబు ప్రకటనతో అసలు ఈ చెంఘీజ్‌ఖాన్ ఎవరు.. బాలయ్య ఈ మూవీ ఎందుకు చేయాలనుకుంటున్నారు.. చెంఘీజ్ ఖాన్ లో అంత స్పెషాలిటీ ఏం ఉందని.. అతడి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.
ప్రపంచంలోనే పేరు పొందిన మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తే ఈ చెంఘీజ్‌ఖాన్. ఈశాన్య ఆసియాలోని ఓ సంచారజాతికి చెందిన అతడి అసలు పేరు టెమూజిన్. మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించి.. దాని విస్తరణ కోసం ఎన్నో దండయాత్రలు చేశాడని.. అలా, ఏదైనా రాజ్యంపై చెంఘీజ్ దాడి చేస్తే.. అక్కడి ప్రజలపై అతడి సైన్యం క్రూరత్వం ప్రదర్శించేదని.. మహిళలను సైతం ఎత్తుకు వెళ్లిపోయేవాళ్లని పలు చారిత్రక రచనల్లోని సమాచారం. అతడి సైన్యం చేసే వికృత చేష్టలు తట్టుకోలేక పలు రాజ్యాధినేతలు సామంతులుగా మారిపోయారనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ, ఇదంతా చెంఘీజ్‌ఖాన్‌కు ఒకవైపు మాత్రమే. మంగోలులకు అతడు ఆరాధ్య దైవం. యుద్ధ తంత్ర రచనలో ఆయనను కొట్టి ధీరుడు లేడు. ఎంత పెద్ద సైన్యాన్ని అయినా, తన వ్యూహ చతురతతో చెల్లా చెదురు చేసేవాడు. చెంఘీజ్ఖాన్పై అనే పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
చెంఘీజిఖాన్ పాత్రతో సినిమా చేయాలని బాలయ్య అనుకోవడంతో ఆసక్తి మొదలైంది. అసలు ఆ సినిమా ఎలా ఉండనుంది? చెంఘీజ్ ఖాన్ అంటే విలన్ మాత్రమేనా? ఒకవేళ సినిమా చేస్తే విలన్‌గానే చూపిస్తారా? ఈసినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఇలాంటి చారిత్రక కథకు ఎవరు రచయితగా వ్యవహరిస్తారు? ఇలాంటి ఎన్నో అంశాలపై సినీ ప్రియులు ముచ్చటించుకుంటున్నారు. ఇలాంటి పవర్ఫుల్ కథకు విజయేంద్ర ప్రసాద్ రచయితగా, రాజమౌళి దర్శకత్వం చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సాంఘిక చిత్రాలు బాలయ్య మాత్రమే చేయగలరంటూ బాలకృష్ణపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంతకీ బాలకృష్ణ కల నెరవేరేనా.. తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.