Dhamaka : సెంచరీ కొట్టిన ‘ధమాకా’.. రూ.100 కోట్ల క్లబ్​లో మాస్​మహారాజ రవితేజ

- Advertisement -

మాస్ మహారాజ Dhamaka సినిమా విడుదలవుతుందంటే మినిమమ్ ఎంటర్​టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు ఫీల్ అవుతుంటారు. ఇక పక్కా కమర్షియల్.. అదీ పవర్​ఫుల్ మాస్ ఎంటర్​టైనర్​ మూవీ అయితే ఇక దాని గురించి చెప్పనక్కర్లేదు. గతంలోనూ Dhamanka నుంచి చాలా మాస్ సినిమాలు వచ్చాయి. అవి బాక్సాఫీస్​ను షేక్ ఆడించాయి. కానీ ఇప్పుడు వచ్చిన ధమాకా మూవీ స్పెషాలిటీయే వేరు. రొటీన్ స్టోరీ అయినా.. పక్కా మసాలా అంశాలతో త్రినాథరావు నక్కిన రవితేజ ఫ్యాన్స్​ను దృష్టిలో ఉంచుకుని తీశారు.

Dhamaka
Dhamaka

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.  రెగ్యులర్ మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించాడు. రవితేజ కెరీర్​లోనే ఈ సినిమా హైయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 

ఈ సినిమా వసూళ్లలో అరుదైన ఘనత సాధించినట్లు మాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు  సాధించినట్లు తెలుస్తోంది.ఈ మూవీ వసూళ్లతో రవితేజ కూడా రూ.100 కోట్ల క్లబ్​లో చేరినట్టైంది. ఇంత వరకూ రాజా కెరీర్​లో సెంచరీ కొట్టింది లేదు. ఈ మాస్ హీరో నటించిన చాలా సినిమాలు బ్లాక్​బస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి కానీ వసూళ్ల పరంగా రూ.100 కోట్లు మాత్రం రాబట్టడం ఇదే మొదటిసారి. అలా ధమాకా మూవీరో రవితేజ కలెక్షన్స్​లో ధమాకా క్రియేట్ చేశాడు.

- Advertisement -

ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్​లోనే పూర్తి పెట్టుబడిని రికవరీ చేసిందట. థియేట్రికల్ బిజినెస్ ద్వారా సినిమా ఎంత వసూల్ చేసినా?  అది నిర్మాతలకు అదనపు ఆదాయమే అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెస్తోందని టాక్.

ధమాకా మూవీ.. తెలంగాణ (నైజాం)లో రూ. 228 స్క్రీన్స్‌లో .. మరోవైపు రాయలసీమలో 160 స్క్రీన్స్.. ఆంధ్ర ప్రదేశ్‌లో 280 థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది.  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 670 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ భారత్ కలిపి 70 + ఓవర్సీస్‌లో 200 స్క్రీన్స్‌లో రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 940 పైగా స్క్రీన్స్‌లో ధమాకా సినిమా విడుదలైంది.  ఓ రకంగా ధమాకాకు ఈ రేంజ్ థియేటర్స్ దక్కడం మామూలు విషయం కాదు. అందుకు తగ్గట్టే వసూళ్లను సాధించింది రవితేజ ధమాకా. 

ఈ మూవీలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్​తో పాటు చాలా ఫన్ కూడా ఉంది. రవితేజ మూవీ అంటే మినిమమ్ ఫన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో డ్యూయెల్​ రోల్​లో రవితేజ పంచిన వినోదం న భూతో న భవిష్యత్. ఇక ఈ చిత్రంలో శ్రీలీలతో కలిసి రవితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. చాలా కాలం తర్వాత ఇలాంటి వినోదాత్మక పాత్రలో రవితేజను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పరుగుపెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here