Unstopabble 2 : ఆ మాటతో స్టేజ్ మీదనే కన్నీళ్ళు పెట్టుకున్న ప్రభాస్..

- Advertisement -

బాలయ్య హోస్ట్ గా చేసిన Unstopabble 2 గురించి ఇప్పుడు అందరికి తెలుసు..ప్రభాస్ ఎంట్రీ తో షో టాక్ పూర్తిగా మారిపొయింది..అందుకే ఆఁహాఁ ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు ఎపిసోడ్ లుగా రిలీజ్ చేసింది.మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం వచ్చేసింది. మొదటి భాగం పూర్తిగా ఫన్ మోడ్లో సాగగా, రెండో భాగం మాత్రం ఫన్తో పాటు ఎమోషనల్గా కూడా సాగింది.రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ కూడా స్టేజీ మీద ఎమోషనల్ అయిపోయాడు. ప్రభాస్ తో పాటు బాలకృష్ణ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.

Unstopabble 2
Unstopabble 2

గోపిచంద్ స్టేజీ మీదకు ఎంటర్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. గోపిచంద్ను ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ అడగ్గా, వచ్చే సంవత్సరం ఉండవచ్చేమో అని గోపిచంద్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్, గోపిచంద్లతో బాలయ్య ఒక గేమ్ ఆడారు..ఇకపోతే గోపిచంద్ తండ్రి ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో పాటు ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు ప్రభాస్, గోపిచంద్ ఎలా ఆలోచించారనే దానిపై కూడా బాలకృష్ణ ప్రశ్నించారు. మొదటి ఎపిసోడ్కు ఏ మాత్రం తగ్గని విధంగా ఆసక్తికరంగా ఈ రెండో ఎపిసోడ్ కూడా సాగింది..

పెద్దనాన్న గురించి తలచుకుని ఎమొషనల్ అయ్యాడు..ఈ పరిస్థితిలో ఉన్నామంటే పెదనాన్న వల్లే అని ప్రభాస్ అన్నారు.. ఆయనకు తామంతా రుణపడి ఉన్నామని ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబం అంతా పెదనాన్న మిస్ అవుతున్నారని ప్రభాస్ తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారని ప్రభాస్ తెలిపారు. అప్పుడు తానూ ఆసుపత్రిలో ఉన్నానని, నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరిపానని ప్రభాస్ పేర్కొన్నారు.ఇక బాలయ్య కూడా అతన్ని తలచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు..మొత్తానికి ఆ ఎపిసోడ్ అందరినీ ఆకర్షించింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here