Balakrishna : కొన్ని కొన్ని సార్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ ఉంటాయి. ఇది ఒకరిద్దరి హీరోల విషయం లో మాత్రమే కాదు, దాదాపుగా ఇండియా లో ప్రతీ సూపర్ స్టార్ విషయం లోనూ జరిగింది. అలా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ విషయం లో జరిగింది. ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒక లెజెండ్.

సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలు పొందిన ఆయన, రాజకీయ అరంగేట్రం చేసి కేవలం 8 నెలలు లోపే ప్రభుత్వాన్ని స్థాపించి ముఖ్య మంత్రి అయ్యాడు. నాడు ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ, నేటికీ ఉన్నత స్థాయిలోనే ఉంది. అలా ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయాలతో పాటు, ఎన్నో పరాజయాలు మరియు అవమానాలు కూడా ఉన్నాయి. కానీ బాలయ్య ఎక్కువగా ఎన్టీఆర్ వైభోగం గురించి చూపిస్తూ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరియు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను చేసాడు.

ఈ రెండు చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో కేవలం ఆయన తన తండ్రి ఎన్టీఆర్ పాత్రని పోషించడమే కాదు, నిర్మించాడు కూడా. మొదటి భాగం 75 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేస్తే, కేవలం 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండవ భాగం కి అయితే సున్నా షేర్స్ వచ్చాయి. డబ్బులు బాగా నష్టపోవడం తో బాలయ్య ఈ సినిమాలతోనే తన ప్రొడక్షన్ కంపెనీ ని మూసేసాడు.

అలా తండ్రి జీవిత చరిత్రతో సినిమాలు తీసి ప్రొడక్షన్ కంపెనీ ని మూసేసిన ఏకైక హీరో గా బాలయ్య బాబు రికార్డుకి ఎక్కాడు. ఈ సినిమాలలో ఎన్టీఆర్ వైభోగం తో పాటుగా ఆయన పరాజయాలు , ఎదురుకున్న అవమానాలను కూడా చూపించి ఉంటె మంచి ఎమోషనల్ గా ఉండేది, రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యేవి, ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఓవర్ భజనే అని అప్పట్లో ఒక టాక్ ఉండేది.