Trisha : చిరంజీవి కంటే బాలయ్యే గ్రేట్ అంటున్న హీరోయిన్ త్రిష.. ఆయన కోసం ఉచితంగా ఆ పని చెయ్యబోతుందా!

- Advertisement -

Trisha : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు త్రిష. ఈమె సౌత్ లో పని చెయ్యని స్టార్ హీరో అంటూ మిగిలి లేడు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సీనియర్ హీరోలైన చిరంజీవి , నాగార్జున, బాలకృష్ణ మరియు వెంకటేష్ ఇలా అందరితోనూ నటించింది. ఇక నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో కూడా చేసేసింది.

Trisha
Trisha

కేవలం అల్లు అర్జున్ మరియు రాంచరణ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నారు. ఇక తమిళం లో కూడా ఈమె రజినీకాంత్ తో తప్ప అందరి స్టార్ హీరోలతో కలిసి నటించేసింది. అయితే రీసెంట్ గా ఈమె టాలీవుడ్ లో ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరితో కలిసి నటించడానికి ఇష్టపడుతారు అని అడగగా, క్షణం కూడా ఆలోచించకుండా బాలయ్య బాబు పేరు చెప్పేసింది.

Balakrishna Trisha

యాంకర్ అడిగిన ఆ నలుగురు హీరోల పేర్లలో చిరంజీవి పేరు కూడా ఉంది, కానీ ఆమె చిరంజీవి పేరుని చెప్పడానికి ఇష్టపడలేదు. అంతే కాదు రీసెంట్ గా ఆమెకి చిరంజీవి – వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆమె ఆ చిత్రం లో నటించడానికి డేట్స్ ఖాళీ లేవంటూ నో చెప్పేసింది. కానీ ఇప్పుడు బాలకృష్ణ మరియు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో మాత్రం నటించడానికి వెంటనే ఓకే చెప్పేసింది.

- Advertisement -
chiranjeevi trisha

దీనికి అర్థం ఈమెకి చిరంజీవి సినిమాకంటే ఎక్కువగా బాలయ్య సినిమానే ముఖ్యం అని కదా? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషన్ తర్వాత డైరెక్టర్ బాబీ తో కలిసి చెయ్యడం వల్ల ఈ చిత్రం పై ప్రారంభ దశ నుండే మంచి హైప్ ఏర్పడింది. ఈ చిత్రం తో బాలయ్య తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here