NTR : బాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ కు తప్పని లీకుల కష్టాలు.. ‘వార్2’ లీక్ వీడియో ఇదే..!

- Advertisement -

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ తో బాలీవుడ్​కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యశ్ రాజ్ స్పై యూనివర్స్​లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్​లోనే మోస్ట్ యాంటీస్ పెటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్​గా ‘వార్ 2’ రూపొందుతోంది. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసిన నటించిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్​గా వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్​ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.

jr ntr
jr ntr

యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి రాబోతున్న స్పై మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్‘ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ కావడంతో తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైల్ నెలకొంది. ఈ క్రమంలోనే ‘వార్ 2’ నుంచి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

NTR
NTR

‘వార్ 2’ షూటింగ్ ని స్పెయిన్ లో మొదలుపెట్టారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో లీకై నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ షూటింగ్ కు సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

https://twitter.com/scrollandplay/status/1714614208837627976?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714614208837627976%7Ctwgr%5E149009af0960b3b062f61a335fa4cf8954da5a2d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fntr-hrithik-roshan-s-war2-shoot-begins-123344
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here