Big Boss : హౌస్‌మేట్ సందీప్‌కు హోస్ట్ నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. నువ్వేమైనా పిస్తావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంచాలకుడిగా విఫలమయ్యావని అన్నారు. ప్రియాంక, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లో వీకెస్ట్ కంటెస్టెంట్‌ను పక్కన పెట్టాలని ‘బిగ్ బాస్’ చెబితే స్ట్రాంగెస్ట్ కంటెస్టెన్ను అనర్హుడిగా ప్రకటించడం, ప్రియాంకకు సలహాలు ఇవ్వడంపై నిలదీశారు.
అయితే, స్పైసీ చికెన్ టాస్క్‌లో మాత్రం సందీప్ నిర్ణయాన్ని సమర్దించారు. అంతేకాదు, అమర్దీప్, ప్రియాంకలకు కూడా నాగ్ గట్టిగానే క్లాస్ పీకారు. ప్రియాంక, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లో వీకెస్ట్ కంటెస్ట్‌ను ఎంపిక చేయాలంటే.. స్ట్రాంగ్‌గా ఉన్న ప్రిన్స్ యావర్‌ను ఆ టాస్క్ నుంచి తొలగించారు. ఇందుకు సంచాలకుడిగా వ్యవహరించిన సందీప్.. ప్రియాంకకు బీస్ట్ టాస్క్ అంశాన్ని ప్రస్తావిస్తూ యావర్‌ను టాస్క్ నుంచి పక్కకు తప్పించేందుకు సహకరించాడు. ఈ విషయాన్నే నాగ్ ప్రస్తావిస్తూ సందీప్‌కు క్లాస్ పీకారు.
అప్పటికి బిగ్ బాస్ తనని సంచాలకుడిగా ప్రకటించలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, నాగ్.. నిన్ను సంచాలకుడిగా ప్రకటించిన తర్వాతే బీస్ట్ టాస్క్ గురించి ప్రియాంక దగ్గర ప్రస్తావించి ఆమెతో చర్చించావని అన్నారు. నువ్వు ఏమైనా పిస్తా అనుకుని బిగ్ బాస్ పిలిచాడని అనుకుంటున్నారా అని నాగ్ అన్నారు. ఇలా చేసినందుకు సందీప్‌ను జైలుకు పంపాలా? లేదా ఆయన బ్యాటరీ లైఫ్‌ను తగ్గించాలా అని ప్రియాంక, శోభాశెట్టిని అడిగారు. దీంతో వారు జైలుకు పంపాలని చెప్పారు. అయితే నాగ్ మాత్రం సందీప్ బ్యాటరీ డౌన్ చేయాలని ఆదేశించారు.