Pooja Hegde : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసిన పూజా.. రెచ్చిపోయి రొమాన్స్ కు సిద్ధమైందిగా..

- Advertisement -

Pooja Hegde : పూజ హెగ్డే కి కెరియర్ పరంగా గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సుమారు రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. తెలుగులోనే అనుకుంటే బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు కూడా ఆమెకి ఆశించిన స్థాయి సక్సెస్ ని అందించలేకపోతున్నాయి. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే అందరూ పూజ హెగ్డే పేరునే చెప్పేవారు.

Pooja Hegde
Pooja Hegde

స్టార్ హీరోలు సైతం ఏరి కోరి ఈ హీరోయినే కావాలని అనేవారు. కానీ రెండేళ్ల నుంచి పూజ హెగ్డే కెరియర్ చూసుకుంటే ఒక్క హిట్టు కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత పూజ హెగ్డే నటించిన ఆరు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. సరే సౌత్ లో ప్లాప్స్ వస్తున్నాయని నార్త్ కు వెళ్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్’ మూవీ బాలీవుడ్ లో తొలిరోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుని ఘోరమైన ప్లాప్ ని చవి చూసింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి చేసిన సల్మాన్ ఖాన్ ‘కీసిక భాయ్ కిసీకా జాన్’ సైతం డిజాస్టర్ అయింది.

అలా బాలీవుడ్ లో ఈ అమ్మడికి వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో రెండు సినిమాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించబోయే ‘కోయి షక్’ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఇక ఇందులో బెడ్ రూమ్ సన్నివేశాలకు కూడా పూజా ఓకే చేసిందని టాక్ వినిపిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here