Supritha : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి నటవారసులు కొత్తేం కాదు. చాలా మంది ఇప్పటికే వచ్చారు. కొందరు రాణిస్తున్నారు. మరికొందరు ఫెయిల్యూర్స్‌ను తట్టుకోలేక సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వారసుల్లో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువే. అయితే ఓ అమ్మాయి మాత్రం ఇండస్ట్రీలోకి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు కానీ పాపులారిటీ మాత్రం ఓ స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలిసిపోయిందనుకుంటా..?
ఇంకెవరండీ.. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణీ కూతురు సుప్రీత. సురేఖా వాణి గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమాల్లో అమ్మ, వదిన, సిస్టర్ క్యారెక్టర్స్ లో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ రోల్స్ లో ఆమె తన ప్రతిభ చాటుకుంది. ఇక ఈ భామ తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బుడ్డిబుడ్డి బట్టలేసుకుని పాటలకు స్టెప్పులేస్తూ వ్యూయర్స్‌కు మజా అందిస్తుంటారు.
ఇక సుప్రీత ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను చూస్తేనే అర్థమైపోతుంది ఈ బ్యూటీకున్న క్రేజ్ ఏంటో. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ.. వీడియోలు.. డబ్‌స్మాష్‌లు.. రీల్స్‌తో అదరగొడుతూ ఉంటుంది సుప్రీత. ఇక ఈ భామ డ్రెస్సింగ్ స్టైల్ అదరహో అనిపించేలా ఉంటుంది. చీర కట్టినా.. వెస్టర్న్ డ్రెస్ వేసిన ఈ బ్యూటీ బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది. ఈ భామ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతూ నెట్టింట తెగ కామెంట్లు పెడుతుంటారు.
ఇక తాజాగా సుప్రీత మరో వీడియోతో సందడి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పింక్ కలర్ శారీలో సుప్రీత సూపర్‌గా కనిపిస్తోంది. లూజ్ హెయిర్‌తో స్లిమ్ పర్సనాలిటీతో క్యూట్ స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఖడ్గం సినిమాలోని నువ్వూ.. నువ్వూ.. నువ్వే.. నువ్వు అనే పాటకు ఈ బ్యూటీ స్టెప్పులేసింది. ఈ వీడియోలో సుప్రీత ఎక్స్ప్రెషన్స్కు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. అందమంటే నీది కాదా.. కాదా.. అంటూ పాటలు పాడేసుకుంటున్నారు.