Sai Pallavi: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కాగా ఇప్పటికే టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ – మాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలంతా తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి మ్యారీడ్ లైఫ్ కు వెల్కమ్ చెబుతున్నారు. పెళ్లి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా త్వరగా ప్రెగ్నెన్సీ వార్తలను కూడా కన్ఫామ్ చేస్తూ అభిమానులకి డబుల్ గుడ్ న్యూస్ అందిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె మరెవరో కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి చెల్లె పూజా కనన్. అవును ప్రజెంట్ ఇదే వార్త మీడియాలో వైరల్ అవుతోంది. సాయిపల్లవి కంటే ముందే తన చెల్లి పూజా కనన్ పెళ్లి చేసుకోబోతుందట. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ అయిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పూజా కనన్ ని పెళ్లి చేసుకోబోయేది మరెవరో కాదట. తన సొంత బావనే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిరించిన పెళ్లి అని .. త్వరలోనే వీళ్ల వెడ్డింగ్ డేట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సాయి పల్లవి చెల్లి పూజ కనన్ పేరు మరోసారి నెట్టింట మారుమ్రోగిపోతుంది.
