చెల్లెలు తో రొమాన్స్ చెయ్యబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్ తట్టుకోగలరా!

- Advertisement -

ఒకప్పుడు ఎన్టీఆర్ కి కూతురు గా నటించిన శ్రీదేవి, పెద్దయ్యాక హీరోయిన్ గా నటించింది. సోదరి గా నటించిన సావిత్రి కూడా హీరోయిన్ గా నటించింది. అలా అప్పట్లో చాలా కామన్ గా ఉండేవి. అప్పటి ప్రేక్షకులు సినిమాని సినిమాలాగానే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చెల్లి గా నటించిన ఒక హీరోయిన్ మళ్ళీ హీరో పక్కన రొమాన్స్ చేస్తే ఆడియన్స్ తీసుకోలేని పరిస్థితి వచ్చింది.

చిరంజీవి
చిరంజీవి

కానీ ఇప్పుడు చిరంజీవి అలాంటి ప్రయోగమే చెయ్యబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో నయనతార చిరంజీవి కి చెల్లెలుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ముందు వచ్చిన ‘సై రా నరసింహ రెడ్డి’ చిత్రం లో చిరంజీవికి కి జోడిగా నటించింది నయనతార. ఆ సినిమా హిట్ అయ్యింది కానీ, గాడ్ ఫాదర్ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఆ సినిమా అలా ఫ్లాప్ అవ్వడానికి కారణం, ఒకసారి హీరో హీరోయిన్లు గా చూసిన జంట ని మళ్ళీ అన్నా చెల్లెలుగా ఆడియన్స్ తీసుకోలేకపోయారు అని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ లో చెల్లి గా నటించిన తర్వాత, ఆమె చిరు కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధం అయ్యిందట. మెగాస్టార్ చిరంజీవి మరియు వసిష్ఠ (భింబిసారా ఫేమ్) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -

సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కబోయే ఈ చిత్రం లో చిరంజీవి జోడిగా నయనతార ఫిక్స్ అయిపోయిందట. ఇప్పుడు అభిమానుల్లో మెలిగే సందేహం ఏమిటంటే, రీసెంట్ గానే అన్న చెల్లెలు గా నటించిన ఈ ఇద్దరు, మళ్ళీ హీరో హీరోయిన్స్ అంటే జనాలు చూస్తారా అని. చిరంజీవి ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ చేస్తున్నాడు, ఆడియన్స్ ఆ రిస్క్ ని అంగీకరిస్తారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here