ఏ దిక్కూ లేక దేవుడిని నమ్ముకున్న ప్రశాంత్ నీల్.. సలార్ విడుదలకు భయపడుతున్నాడా..!

- Advertisement -

‘కేజీఎఫ్‌’తో తన ప్రతిభను నిరూపించుకుని ఎంతో మందికి అభిమాన దర్శకుడిగా మారారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సలార్‌’. గత కొన్ని రోజు నుంచి వార్తల్లో ఉంటున్న ఈ సినిమా.. తాజాగా మరో అంశంతో కారణంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. కృష్ణాష్టమి సందర్భంగా ప్రశాంత్‌ నీల్ తన కుటుంబంతో కలిసి సత్యసాయి జిల్లాలోని సొంత ఊరు నీలకంఠపురం వెళ్లారు. అక్కడ తన తండ్రి సమాధికి నివాళులర్పించారు.

సలార్
సలార్

అనంతరం ఆ గ్రామంలోని గుడిలో పూజ చేయించారు. అయితే అందులో తన కుటుంబసభ్యుల పేర్లు చెప్పిన ప్రశాంత్‌ నీల్‌.. వాటితో పాటు ‘సలార్’ పేరు కూడా చెప్పారు. సినిమా విజయం సాధించాలని ప్రార్థించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాల విడుదలకు ముందు ఇలా పూజ చేయిస్తారని సమాచారం. గతంలో ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌2’ సినిమా రిలీజ్‌లకు ముందు ఇలానే పూజ చేయించారట. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ‘సలార్‌’ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 28న దీన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ విడుదల కోసమే ప్రశాంత్ నీల్ పూజ చేయించారని తెలుస్తోంది. మరోవైపు ‘సలార్‌’ రిలీజ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇప్పటి వరకూ స్పందించలేదు. అలాగే విదేశాల్లో ఈ సినిమా టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించగా.. అవి భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనునట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here