Vaishnavi Chaitanya : బాక్సాఫీస్​ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ‘బేబీ’ కి నో ఆఫర్స్​!.. అదే కారణమా..?

- Advertisement -

Vaishnavi Chaitanya : మొన్నటిదాకా ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా కొంతమందికే తెలుసు. ఓ యూట్యూబర్ గా .. ఇన్ఫ్లుయెన్సర్ గా.. షార్ట్ ఫిల్స్ లో కనిపించే హీరోయిన్ గా .. మాత్రమే తెలుసు. కరోనా లాక్ డౌన్ వల్ల.. సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో ఈ భామ పేరు కాస్త ఎక్కువగా వినిపించింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా.. పేరు మాత్రం ఎక్కువగా వినిపించలేదు. అయితే అకస్మాత్తుగా వైష్ణవికి ఓ సినిమా ఆఫర్. షూటింగ్ జరిగినన్ని రోజులు ఎలాంటి సందడి లేదు.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

కానీ.. ఒక్కసారిగా సినిమా గ్లింప్స్.. పాటలు.. టీజర్.. ట్రైలర్.. ఇలా ఒక్కొక్క అప్డేట్ వచ్చినా కొద్దీ వైష్ణవి చైతన్య ఎవరో మెల్లమెల్లగా అందరికీ తెలియడం మొదలైంది. అలా బేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవి చైతన్య అనే పేరు మార్మోగిపోయింది. ఇప్పటికే అరడజనుకుపైగా సినిమాలు చేసిన హీరోల మధ్య తాను ఫ్రెషర్ అయినా.. నటనలో మాత్రం వాళ్లను మించిపోయిందనే టాక్ వినిపించింది. కేవలం ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ పెద్దలు కూడా శెభాష్ అని ప్రశంసించారు ఈ భామను.

ఇక ఆ సినిమాతో వైష్ణవి చైతన్య దశ తిరిగిందని అందరూ అనుకున్నారు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని ఊహించారు. కానీ బేబీ సినిమా రిలీజ్.. సక్సెస్ మీట్.. సంబురాలు.. ఇలా అన్నీ పూర్తయిపోయాయి. సినిమా తాజాగా ఆహా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. నెమ్మదిగా వైష్ణవి పేరు వినిపించడం.. ఈ బ్యూటీ వార్తల్లో కనిపించడం తగ్గిపోయింది. బేబీ సినిమా తర్వాత ఈ భామకు బోలెడు ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బేబీలో డ్యాన్స్, ఎమోషన్స్, ఎక్స్‌ ప్రెషన్స్, కామిక్ టైమింగ్‌తో వైష్ణవి పర్ఫెక్ట్‌ గా కనిపించింది. కానీ, అదృష్టం ఇంకా ఆమె తలుపు తట్టడం లేదు.

- Advertisement -

ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన శ్రీలీల డజనుకుపైగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. అది కూడా తొలి సినిమా ఫ్లాప్ అయినా.. ఇన్ని అవకాశాలు అందుకుంది. కానీ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవి పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఈ భామ తెలుగమ్మాయి కావడమే ఆమెకు శాపమైందని అభిమానులు అంటున్నారు. ఒకవేళ ఈ బ్యూటీ తెలుగమ్మాయి కాకపోయి ఉంటే తనకు కూడా బోలెడు అవకాశాలు తలుపు తట్టి ఉండేవని ఫీల్ అవుతున్నారు.

ఎంత టాలెంట్ ఉన్నా.. ఎంత అందమున్నా.. ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎప్పుడూ కరువేనంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో కాకపోయినా.. చిన్న సినిమా అవకాశాలైనా వస్తే వైష్ణవి తనేంటో నిరూపించుకుంటుందని అంటున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మా వైషూకి ఒక్క ఛాన్స్ అంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్లకు.. హీరోలకు.. నిర్మాతలకూ వైష్ణవి అభిమానులు రిక్వెస్టులు పెడుతున్నారు. మరి ఈ భామ ఫేట్ ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఆల్ ది బెస్ట్ బేబీ.. అదే అదే ఆల్ ది బెస్ట్ వైష్ణవి చైతన్య.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here