రామ్ చరణ్, ఉపాసన పెళైన 11 ఏళ్ల గ్యాప్ తరువాత రీసెంట్ గానే తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి తెలిసిందే. మెగా వారసురాలికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ వారసురాలితో ఇటు నాయనమ్మ-తాతయ్యలు సురేఖ- మెగాస్టార్ చిరంజీవి అటు అమ్మమ్మ-తాతయ్య శోభన-అనిల్ కామినేని దిల్ ఖుష్ అవుతున్నారు. తమ సమయాన్ని మనవరాలితో సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటు రామ్ చరణ్ కూడా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి మరీ.. కూతురితో ఆడుకుంటున్నాడు. తన గారాల పట్టిని వదిలి ఉండలేక.. ఎక్కువ టైమ్ క్లింకారకు ఇచ్చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, నేడు ఆగష్టు 15 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు త్రివర్ణ జెండాని ఎగరవేసి స్వేచ్ఛ వాయువుని తీసుకుంటున్నారు. ఇక మెగా వారసురాలు కూడా తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొంది. కేవలం పాల్గొనడమే కాదు ఆ త్రివర్ణ పతాకాన్ని తన చేతులతో ఎగరవేసింది. తన అమ్మమ్మ-తాతయ్యతో కలిసి జెండా వందనం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా చేశారు.
“క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ-తాతయ్య. అమూల్యమైన క్షణాలు” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చరణ్ అండ్ ఉపాసన ఇప్పటి వరకు క్లీంకార పేస్ ని రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో క్లీంకార పేస్ కొంచెం కనబడుతుంది. ఇక ఇది చూసిన మెగా అభిమానులు లవ్ సింబల్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు. మరి మీరు కూడా ఒకసారి ఆ పిక్స్ ని చూసేయండి.