ఆ హీరోయిన్ కోసం సంయుక్త మీనన్ కెరీర్ ని సర్వ నాశనం చేస్తున్న స్టార్ డైరెక్టర్!

- Advertisement -

రీసెంట్ సమయం లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది కొత్త హీరోయిన్స్ లో అటు అందం పరంగా కానీ, నటన పరంగా కానీ మంచి మార్కులు కొట్టేసిన ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె ఆ తర్వాత ‘భింబిసారా’ , ‘సార్’ మరియు ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.

సంయుక్త మీనన్
సంయుక్త మీనన్

ఈమెతో సినిమా చేస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతల్లో కూడా మొదలైంది. ప్రస్తుతం ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘డెవిల్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత సంయుక్త మీనన్ ఎలాంటి ప్రాజెక్ట్ కి సంతకం చెయ్యలేదు. వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది అనుకున్న సంయుక్త మీనన్ ఎందుకు ఇంత స్లో అయిపోయింది అని అందరూ అనుకుంటూ ఉన్నారు.

అయితే ఈమె ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాగా క్లోజ్ అయ్యిందని సోషల్ మీడియా లో వార్తలు చాలాకాలం నుండి వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇతనితో సన్నిహితంగా ఉన్నంత కాలం సంయుక్త మీనన్ కి మంచి అవకాశాలే వచ్చాయి. అయితే వీళ్లిద్దరి మధ్య లేటెస్ట్ గా ఏవో గొడవలు వచ్చాయట. అప్పటి నుండి త్రివిక్రమ్ సంయుక్త మీనన్ కి అవకాశాలు రాకుండా చేస్తున్నాడని టాక్. వాస్తవానికి త్వరలో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తియ్యబోయ్యే సినిమాలో హీరోయిన్ గా తొలుత సంయుక్త మీనన్ ని తీసుకున్నాడు.

- Advertisement -

కానీ వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవ తర్వాత ఆయన సంయుక్త మీనన్ ని తప్పించి, శ్రీలీల కి అవకాశం ఇచ్చాడు. ఇలాగే సంయుక్త మీనన్ చెయ్యాల్సిన చాలా సినిమాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీలీల కి షిఫ్ట్ చెయ్యిస్తున్నదని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న టాక్. అలా వేరే లెవెల్ కి వెళ్తుంది అనుకున్న సంయుక్త మీనన్ కెరీర్ ఇలా స్లో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈమె మలయాళం సినిమాల వైపు ఫుల్ ఫోకస్ పెట్టడానికి చూస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here