Heros : ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల సందడి కనిపించింది. గత రెండేళ్ళు కరోనా కారణం చిత్ర పరిశ్రమ మూగ పోయింది..ఆ తర్వాత నిబంధనలను పాటిస్తూ సినిమా షూటింగ్ లు, విడుదల కొనసాగాయి..ఈ ఏడాది విడుదల సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫిస్ వద్ద భారీ హిట్ ను అందుకున్నాయి..అత్యధిక వసూల్ లను కూడా అందుకున్న సినిమాలే ఉన్నాయి..రెండేళ్ళు ఉన్న నష్టాన్ని ఆ సినిమాలు పూర్తీ చేశాయి.ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లోనే సక్సెస్ రేట్ ఎక్కువ స్థాయిలో పెరిగింది. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రేక్షకులనే కాకుండా సొంత అభిమానులను సైతం నిరాశ పరిచిన చిత్రాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది కనీసం ఫ్యాన్స్‌ను కూడా మెప్పించలేకపోయిన స్టార్ హీరోల సినిమాలు ఏవో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం…
రాధేశ్యామ్:
తెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్
. హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ చిత్రం మార్చి 11న గ్రాండ్ రిలీజ్ అయింది. కానీ మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ ను మూటగట్టుకుని భారీ నష్టాలు మిగిల్చింది. చివరకు ప్రభాస్ అభిమానులు సైతం ఈ మూవీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఆచార్య
.. ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. మెగా అభిమానులను కూడా ఆచార్య ఆకట్టుకోలేకపోయింది.
లైగర్:
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్
. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఆగస్టులో విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. విజయ్ అభిమానులు కూడా ఈ మూవీపై పెదవి విరిచారు..
ఇవే కాదు నాగచైతన్య నటించిన థ్యాంక్యూ.. నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి.బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి…