టాలీవుడ్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈయన ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని ఉపాసనను ప్రేమించి.. ఆపై పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఉపాసన మరెవరో కాదు ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు. 2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇక ఇటీవలే వీళ్లిద్దరికీ క్లింకార పుట్టిన విషయం తెలిసిందే.
సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి అవ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫాన్స్ తెగ సంబరాలు జరుపుకున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి తాత అవ్వడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇక ఫాన్స్ మాత్రం మెగా ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ తరుణంలోనే రామ్ చరణ్, ఉపాసనల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ 1985 మార్చి 27 చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వయస్సు 38 సంవత్సరాలు. ఇక ఉపాసన విషయానికొస్తే.. 1989 జూలై 20న అనిల్ కామినేని, శోభన కామినేని దంపతులకు జన్మించింది. ఇక రామ్ చరణ్, ఉపాసనల మధ్య సుమారు 4 సంవత్సరాల 8 నెలల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన దాదాపు నాలుగున్నర ఏళ్ళు పెద్దది. దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కాస్తా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ కంటే ఉపాసన అన్ని సంవత్సరాలు పెద్దదా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.