డైరెక్టర్ తేజ ఒక అబద్దాలకోరు.. ఇప్పుడు పూర్తిగా మైండ్ దొబ్బింది..: జేడీ చక్రవర్తి

- Advertisement -

డైరెక్టర్ తేజ, నటుడు జేడీ చక్రవర్తి.. వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినవారే. ఆయన శిష్యులే. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఈ విషయాన్ని వాళ్లిద్దరే చాలాసార్లు బహిరంగా చెప్పారు. వాళ్లిద్దర్లో ఒక్కర్ని.. ఇంకొకరి గురించి అడిగినా.. కథలు కథలుగా చెప్తూంటారు. అయితే జేడీ చక్రవర్తి కూడా ఇటీవల తేజ గురించి కాస్త ఎక్కువే చెప్పారు. తేజ.. తన ప్రేమకు సహాయం చేశానని, పెళ్లి కూడా చేశానని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే అబద్దాల్లో ఇది కూడా ఒకటని జేడీ చక్రవర్తి అన్నారు.

జేడీ చక్రవర్తి
జేడీ చక్రవర్తి

‘‘తేజ చేసిన ఓ స్టుపిడ్ మిస్టేక్ ఏంటంటే.. 15, 20 ఏళ్ల కిందట సితార మ్యాగజైన్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు. తన పెళ్లి చేశానని, తన ప్రేమని గెలిపించానని, నెల్లూరు వెళ్లాం అని. కానీ అదేదీ నిజం కాదు. తేజ అలా చెప్పడం చూసి.. నిజానికి చాలా జాలేసింది.. అరెరే.. పాపం అనుకున్నా. ఇంకేం చేస్తాం.. అనుకున్నా. అతను చెప్పినవి చాలా తక్కువ గుర్తుంటాయి. ఎందుకంటే తేజ చెప్పిన వాటిలో చాలా తక్కువ నిజాలుంటాయి. అది అతనికి గుర్తు లేదేమో. తేజ అలా చెప్పాడు అంటే ఆ టైంలో అతను ఏదైనా ప్రాబ్లెంలో ఉండి ఉండాలి లేదంటే.. మైండ్ దొబ్బైనా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇంకా సందేహం ఉంటే ఆ ఇంటర్వ్యూను మళ్లీ చూడొచ్చు” అని జేడీ చక్రవర్తి చెప్పారు.

ఇదిలా ఉండగా జేడీ చక్రవర్తి ఇటీవలే ‘దయా’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో జేడీ సరసన ఈషా రెబ్బా నటించారు. ఆన్ లైన్ లో ఇటీవలే రిలీజైన ఈ సిరీస్.. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘దయా’లో తాను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా కనిపిస్తానని, చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం తన పని అని జేడీ చక్రవర్తి తన పాత్రను గురించి రిలీజ్ కు ముందే వెల్లడించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here