మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల లో అల్లు అర్జున్ Allu Arjun కూడా ఒకరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన గంగొత్రి సినిమా తో హీరో గా పరిచయం అయ్యాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..అందులో వరుడు సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కంటెంట్ పరంగా మంచి మెసేజ్ ను ఇచ్చిన కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది..హీరోయిన్ తో రొమాన్స్ కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యింది..
వరుడు 2010 లో వచ్చిన సినిమా. దర్శకుడిగా గుణశేఖర్ పదవ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్, తమిళ నటుడు ఆర్య, భాను శ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించగా, సుహాసిని మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. మణి శర్మ స్వరపరిచిన ఈ చిత్రం 2010 మార్చి 31న విడుదలైంది.. హీరోకు, హీరోయిన్ కు ఎవరో చూడకుండా పెళ్ళి మండపంలో చూసి అప్పుడే ప్రేమలో పడతారు.ఆ క్షణం లోనే విలన్ ఆమెను తీసుకు పోతాడు..అప్పుడే అతనితో ఫైట్ చేసి మరీ హీరోయిన్ ఎత్తు కోస్తాడు..ఆ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు..
అప్పుడు ఓ సందర్భంలో లిప్ లాక్ సీన్ ఉంటుంది. దాదాపు 5 నిమిషాలు పైన ఉంటుంది.. ఆ సీన్ ను చూసిన వాళ్లు నిజంగానే బన్నీ ఇలా చేస్తారా అనేలా ఘాటు లిప్ లాక్ ను ఇస్తాడు.. అయిన సినిమా ప్రేక్షకులకు చప్పగానే ఉంది. దాంతో పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది..ఈ సినిమా తర్వాత వచ్చిన బన్నీ,హ్యాపీ,నా పేరు సూర్య సినిమాలు కూడా బన్నికి కలిసి రాలేదు.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ త్రివిక్రమ్ కాంబినేషన్లో అలా వైకుంఠం పురంలో సినిమా చేశాడు..ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలను లైన్లొ పెట్టాడు..
గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన పుష్ప తో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు..ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాను పుష్ప2 ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. షూటింగ్ పనుల్లో బిజిగా ఉన్నా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..