విజయ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న మృణాల్‌ ఠాకూర్‌.. లిప్‌లాక్‌ ఫిక్స్‌?

- Advertisement -

బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బుల్లి తెరపై సందడి చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సీతారామం అందించిన సూపర్‌హిట్‌తో ఈ అందాల భామ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది మృణాల్. అది తన ఫేవరెట్‌ విజయ్‌ దేవరకొండతో అట.

విజయ దేవరకొండ
విజయ దేవరకొండ

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ తర్వాత వరుస హిట్‌ సినిమాలతో అగ్రహీరో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం విజయ్‌ సమంతతో ఖుషీ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మెుదట పూజాహెగ్డేను అనుకున్నారు. కానీ ఆమె స్థానంలో మృణాల్‌ను ఫిక్స్‌ చేశారని సమాచారం. వీరిద్దరూ కలిసి ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నారని కొన్ని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

VIjay deverakonda

పరశురామ్‌ చేస్తున్న సినిమాలోనే మృణాల్‌ నటించనున్నారని తెలుస్తోంది. ప్రేమకథా చిత్రంగా రానున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన మృణాల్‌ నటించనుందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం పరశురామ్‌ బాలకృష్ణతో ఓ సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇది పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుందని, ఈలోపు విజయ్‌ దేవరకొండ సినిమా పూర్తిచేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం సమంతతో కలిసి విజయ్‌ నటిస్తున్న ‘ఖుషి’ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. దీని తర్వాత పరశురామ్‌ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

ఇక విజయ్‌ దేవరకొండతో నటించడం తన డ్రీమ్‌ అని మృణాల్ ఠాకూర్‌ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయితే మృణాల్‌ కల తీరినట్లే అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇక విజయ్‌ సినిమా అంటే మినిమమ్‌ రొమాన్స్‌ ఉండాల్సిందే. వీళ్ల జోడీ బాగుంటుందని, పక్కాగా లిప్‌లాక్‌ ఉంటుందని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం మృణాల్‌ నానితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్‌ గోవాలో జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here