Prabhas : ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వనున్న డార్లింగ్..భూత్ బంగ్లా తో..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ Prabhas క్రేజ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలుసు.బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.ఇప్పుడు ఆయన ఆ రేంజ్ సినిమాలను చేస్తూ బిజిగా ఉన్నాడు.బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తున్నాడు..ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కే, సలార్‌తో పాటు సందీప్‌ వంగ దర్శకత్వంలో సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే..

Prabhas
Prabhas

ఈ సినిమాలు ఇంకా విడుదల కాలేదు కానీ మరో సినిమాను లైన్లొ పెట్టాడు.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..మొదట్లో ఈ కాంబినేషన్‌పై చాలా వరకు నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావడంతో ఈ కాంబోలో ఫిక్స్‌ అయ్యింది. పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌ తొలిసారి ఒక హారర్‌ అండ్‌ కామెడీ కాన్సెప్ట్‌ మూవీలో నటించనున్నారన్న వార్త ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..ప్రభాస్ను ఇలాంటి సినిమాలో ఊహించుకోవడం కష్టమే అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా..తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట సందడి చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు.. బుధవారం ఈ షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ప్రభాస్‌ ఫుల్‌ టైమ్‌లో నటించడం ఇదే తొలి రోజు కావడం విశేషం. ఈ షూటింగ్‌లో భాగంగా ఓ భారీ భూత్ బంగ్లా సెట్‌ ను వేశారని తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీ బడ్జెట్ తో వేసిన సెట్‌లో ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

- Advertisement -

ప్రస్తుతం ఈయన సలార్‌, ప్రాజెక్ట్ కే షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ మారుతి కోసం వారం రోజులపాటు కాల్షిట్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here