నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు ఒక పండగ లాగా జరుపుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, మరెన్నో మంచి పనులు ఆయన పుట్టినరోజుకి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేస్తున్నారు, ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసారు.

ఇక ఆయన అనిల్ రావిపూడితో చేస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ టీజర్ కూడా విడుదల అయ్యింది. ఇదంతా పక్కన పెడితే బాలయ్య పుట్టిన రోజు నాదే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంట్లో అనుకోని సంఘటన ఒకటి ఎదురైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

అదేమిటంటే బెల్లంకొండ సురేష్ ఇంట్లోకి దొంగలు చొరబడి , ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత ఆ కార్ లో ఉన్న 50 వేల రూపాయిల డబ్బు, మరియు ఖరీదైన ఇంపోర్టెడ్ 11 మద్యం బాటిల్స్ ని చోరీ చేసారు. బాలయ్య పుట్టినరోజు నాడే ఇలాంటి సంఘటన జరగడం యాదృచ్చికం. ఎందుకు బాలయ్య తో పోలుస్తున్నామంటే, గతం లో బాలయ్య మరియు బెల్లంకొండ సురేష్ మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

బాలయ్య ఇంటికి వచ్చిన బెల్లంకొండ సురేష్ పై బాలయ్య కోపం తో గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. అప్పట్లో ఈ సంఘటన ఒక సెన్సేషన్ అయ్యింది. ఆయన అలా ఎందుకు చేసాడు అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ, బాలయ్య అభిమానులు మాత్రం అప్పటి నుండి బెల్లంకొండ సురేష్ పై పగ పెంచుకున్నారు. ఇక నేడు బాలయ్య పుట్టినరోజు నాడు జరిగిన ఈ దాడి లో వాళ్ళ హస్తం ఏమైనా ఉందా అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ అనుమానిస్తున్నారు.
