కరాటే కళ్యాణి పై వేటు వేసిన ‘మా’ అసోసియేషన్.. రీసెంట్‌గా ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కరాటీ కళ్యాణికి ‘మా’ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసారు. ఈ విషయమై కరాటే కళ్యాణి స్పందించింది. రీసెంట్‌గా కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయమై షోకాజ్ నోటీసులు పంపించడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 28న అన్న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఆయన 100వ జయంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే పనిలో పడ్డారు.
ఇప్పటికే గత యేడాది నుంచి వివిధ కార్యక్రమాలు ఆయన తనయుడు బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు చేపట్టిన విషయం తెలిసిందే కదా. ఇక ఆ మహానాయకుడి జన్మ దినం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని లకారం చెరువు మధ్యలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠంచబోతున్నట్టు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ఈ విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ మనవడు .. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందజేసాడు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ జరగబోతుంది.
ఈ మొత్తం వ్యవహారంపై ఆమె మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ గురించి నేను తక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని (Karate Kalyani) కరాటే కళ్యాణి వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణుని రూపంలో విగ్రహం ఏర్పాటు చేయొద్దని మాత్రమే నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ రాముడి పాత్రలో, చిరంజీవి శివుడి పాత్రలో, నాగార్జున అన్నమయ్య రామదాసు పాత్రల్లో, సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్రల్లో నటించారని కరాటే కళ్యాణి అన్నారు. వీళ్లందరికీ కూడా అలాగే విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించింది. ఒక బడా హీరోని ఉద్దేశిస్తూ.. వాడు అమ్మాయిలను అమ్ముకునే రకం అని చెప్పింది.