ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లవ్లీ కపుల్స్ లో నరేష్ -పవిత్ర లోకేష్ జంట కూడా ఒకటి.. ప్రస్తుతం అందరు చూపు వీరిపైనే ఉంది.. సోషల్ మీడియాలో వీరిపై రోజుకో ఒకవార్త రావడంతో ట్రేండింగ్ లో ఉన్నారు.. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న సంగతి తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలుసు.. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.. ప్రస్తుతం నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతితో మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లై చేశాడు.. ఆ విషయం ఇంకా కోర్టులో ఉన్నాయి.. అందువల్లే పెళ్లి చేసుకోలేదు.. ఇకపోతే వీరిద్దరూ ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తుంది.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో జోరును పెంచారు..
ఈ క్రమంలో ప్రెస్ మీట్స్, ఇతర మూవీలకు సంబందించిన ఈవెంట్స్ లలో కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ కూడా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ, రొమాన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మళ్లీ పెళ్లి సినిమా విడుదల నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్, పవిత్ర ఇద్దరు మళ్లీ పెళ్లి మూవీలోని రారా హుజురు పాటకు స్టేజీ మీద డ్యాన్స్ తో రెచ్చిపోయారు. రొమాంటిక్ సాంగ్కు అనుకూలంగా వీరు.. స్టేజీ మీద రొమాంటిక్ స్టెప్స్ వేసి.. ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుందిఈ సినిమా మే 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ సినిమా గురించి ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు.. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..
ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.. అందులో వెయ్యి కోట్ల ఫిగర్ సార్ మీరు’ అనే డైలాగ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ఆయన నవ్వుతూనే తానొక బిలియనీర్ని అని ఒప్పుకున్నారు. తన తల్లి విజయనిర్మల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన సంపద కొంత అయితే, తను కష్టపడి సంపాదించిన ఆస్తి ఇంకొంత ఉందని నరేష్ తెలిపారు. అంతేకాక తన దగ్గర ఉన్నదంతా వైట్ మనీ అని.. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవ్వరైనా చెక్ చేసుకోవచ్చన్నారు నరేష్. చాలా గౌరవప్రదంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నానని చెప్పుకొచ్చానని నరేష్ అనడం ఆసక్తిగా మారింది.. ఏది ఏమైనా కూడా ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.. ఇక సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.. ఆ రొమాంటిక్ డ్యాన్స్ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..