ఆ విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లని ఫాలో అవుతున్న లేడి సూపర్ స్టార్ నయనతార..

- Advertisement -

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో లేడి సూపర్ స్టార్ గా ఉన్న “నయనతార” గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక కొంతకాలంగా టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ భామ.. కోలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ హీరోయిన్‌.. ఓవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోంది.

nayanthara

కాగా ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తో ఎన్నో ఏళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకొని గత ఏడాది జూన్‌లో పెళ్లి పీటలెక్కింది నయనతార. అతిరథ మహారథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు ఈ జంట. పెళ్లి తర్వాత కూడా నటిగానే కాకుండా నిర్మాతగానూ సత్తాచాటుతోంది నయన్‌. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మిస్తోంది. అలాగే బయటి మూవీస్‌ను కూడా డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే పలు వ్యాపారాలు కూడా చేస్తూ మంచిగా సంపాదిస్తుంది ఈ లేడి సూపర్ స్టార్.

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు మన స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల బయట లోనే ఈ నటి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరోల మాదిరి గానే థియేటర్ నిర్మించనుందట నయన్. ఈ మేరకు ఇటీవల చెన్నైలో మూతబడిన అగస్త్య థియేటర్‌ను నయన్‌ కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఆ థియేటర్ ని మంచిగా రెనోవేట్ చేయించి మల్టీ ప్లెక్స్‌ థియేటర్‌గా మార్చే ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై నయన్‌ కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడాలి మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో అని.

- Advertisement -
interesting news about nayanatara going to enter in theatres business

మరోవైపు బాలీవుడ్ లో షారుఖ్‌ ఖాన్‌తో కలిసి “జవాన్‌” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది నయనతార. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్‌ 7 న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌లో నయన్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here