సమంత ఎప్పటికీ సంతోషం గా ఉండాలి.. అదే నా కోరిక అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

- Advertisement -

ఒక విడాకులు తీసుకున్న జంట గురించి సోషల్ మీడియా లో రెండేళ్ల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడుకోవడం ఇది వరకు ఎప్పుడూ జరగలేదు, ఒక్క సమంత మరియు నాగ చైతన్య జంట విషయం లోనే జరిగింది.అంతటి క్రేజీ జంట ఇది, విడాకులు తీసుకున్న రోజు నుండి నేటి వరకు వీళ్ళ గురించి సోషల్ మీడియా లో వచ్చినన్ని ఆర్టికల్స్ భారతదేశం లో ఏ రాజకీయ నాయకుడి పైన కానీ, హీరో మీద కానీ రాలేదు,ఆ స్థాయి లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం ఇది.

సమంత
సమంత

అయితే కొన్ని యూట్యూబ్ చానెల్స్ వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఇదే అంటూ ఎవరికీ తోచిన కారణం వాళ్ళు రాసుకుంటూ వచ్చారు.దీనిపై సమంత అప్పట్లో ఫైర్ అయ్యింది,కోర్టు లో కొన్ని యూట్యూబ్ చానెల్స్ మరియు వెబ్ సైట్స్ పై ఆమె కేసు కూడా వేసింది, అయితే ఈ రూమర్స్ పై నాగ చైతన్య ఇది వరకు ఎప్పుడూ స్పందించలేదు.

కానీ ఇప్పుడు స్పందించాడు, ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ఈ నెల 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా నాగ చైతన్య వరుసగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ప్రారంభించాడు,రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వృత్తిపరమైన విషయాలతో పాటుగా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.

- Advertisement -

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంది,ఆమె లేని జీవితానికి అలవాటు పడ్డారా అని అడిగిన ప్రశ్నకి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘అవును..ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ గా గడిపేస్తున్నారు.సమంత చాలా మంచి అమ్మాయి, ఆమెకి ఎప్పుడూ మంచి జరగాలి , సంతోషం గా ఉండాలనే నేను కోరుకుంటూ ఉంటాను.

కానీ సోషల్ మీడియా లో వచ్చే పిచ్చి వార్తలను చూస్తే ఒక్కోసారి చిరాకు గా అనిపిస్తాది, మా ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఇప్పటికీ ఉంది, కానీ మా మధ్య లేని గొడవలను ఉన్నట్టు సోషల్ మీడియా లో కొన్ని వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది’ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here