డింపుల్ హయాతి కోసం గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ షాకింగ్ ఆన్సర్..!

- Advertisement -

గోపీచంద్, డింపుల్ డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రామబాణం. మే 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవల పలు రియాల్టీ, టీవీ షోలలో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ డింపుల్ హయాతి దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది.

డింపుల్ హయాతి
డింపుల్ హయాతి

సినిమా గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఒక అభిమాని.. మేడం.. మీరు నాకు ఒక విషయంలో పర్మిషన్ ఇస్తారా? అని అడిగాడు.. ఏంటో చెప్పండి అని అనడంతో.. మీకు నేను గుడి కట్టాలని అనుకుంటున్నాను.. అది పాలరాయితో కట్టాలా? ఇటుకలతో కట్టాలా ?అని ప్రశ్నించాడు. దానికి డింపుల్ హయాతి సమాధానం ఇస్తూ.. నాకు బంగారంతో గుడి కట్టండి చాలా బాగుంటుంది.. అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక అక్కడున్న అభిమానులంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

Dimpke Hayathi

మరొక అభిమాని ఈ మధ్య మీకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మీపై ట్రోల్స్ వస్తే ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించగా దీనికి ఆమె సమాధానం ఇస్తూ మొదట్లో నాకు ట్రోల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు.. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.. అనుకునే వాళ్ళు అనుకున్నంత అంటూ వదిలేస్తున్నాను. ట్రోల్స్ అన్నీ కూడా ఒక పరిధి దాటనంతవరకు ఫన్నీగా ఉంటాయి.. ఇష్టంగానే ఉంటాయి.. ఒకవేళ హద్దులు దాటితే పరిస్థితి వేరుగా ఉంటుంది.. మేము కూడా మనుషులమే కదా అంటూ డింపుల్ హయాతి చాలా కూల్ గా సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here