చీరకట్టులో కుందనపు బొమ్మ.. మన అందాల కృతి శెట్టి

- Advertisement -

టాలీవుడ్ బేబమ్మ అదేనండి కృతి శెట్టి.. ఈ బ్యూటీ తొలి సినిమా ఉప్పెనతోనే ఉప్పెనంత అభిమానం సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఈ బ్యూటీ అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. వీడసలు.. ముసలోడవకూడదే అంటూ ఈ భామ చెప్పిన డైలాగ్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఆ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ల మదిలో బేబమ్మ తన స్థానం పదిలం చేసుకుంది. ఆ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి.

కృతి శెట్టి
కృతి శెట్టి

ఉప్పెన తర్వాత కృతి శెట్టి నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ దశ తిరిగింది. ఇక ఆ చిత్రం తర్వాత బేబమ్మ.. ద వారియర్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలతో అలరించింది. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడకపోయినా తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరించాయి.

Kriti Shetty
Krithi shetty

వారియర్ సినిమాలో విజిల్ మహాలక్ష్మిగా, బంగార్రాజు మూవీలో సర్పంచ్ నాగలక్ష్మిగా ఈ బ్యూటీ తన పాత్రలతో ఫేమస్ అయిపోయింది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కృతి తన కెరీర్లో పోషించిన ప్రతిపాత్ర చాలా వైవిధ్యమైనదనే చెప్పొచ్చు.

- Advertisement -
Kriti Shetty Saree Photos
Krithi shetty

తాజాగా బేబమ్మ నాగ చైతన్యతో కలిసి మరోసారి జతకట్టింది. ఈ బ్యూటీ కస్టడీ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా కృతి చాలా బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కృతి చీరకట్టులో కనిపించింది. నీలిరంగు చీరలో కృతి నిజంగానే చందమామలా కనువిందు చేసింది. శారీలో కృతి చాలా బ్యూటీఫుల్గా కనిపించింది.

Kriti Shetty Saree Images

కృతిని చీరలో చూసిన కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. చీరకట్టులో బేబమ్మ ఇంత అందంగా ఉందేంటూ ఆశ్చర్యపోతున్నారు. కృతి శెట్టిని ఇలా చూడటం భలే గమ్మత్తుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నీలి రంగు చీరలోనా.. చందమామ నువ్వే జాన అంటూ కుర్రాళ్లు పాటలు పాడేసుకుంటున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెెగ సందడి చేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here