ఈమధ్య కొంతమంది స్టార్ హీరోయిన్లు అభిమానం ని అమ్ముకుంటున్నారు. ఒక స్థాయిలో ఉన్న సెలెబ్రిటీలు ఇలా చెయ్యడం అభిమానులకు మింగుడు పడడం లేదు. లెక్కలేనంత డబ్బుని సంపాదించి ఉంటారు, కానీ ఇప్పటికీ డబ్బు కోసం ఇంత దిగజారాలా అని అభిమానులు పెదవి విరుస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఇలాంటి పనులే చేస్తుంది. ఈమె గతం లో చియాన్ విక్రమ్ తో ‘జెమినీ’ అనే సూపర్ హిట్ చిత్రం లో నటించింది.
ఆ తర్వాత కమల్ హాసన్ తో ‘అన్బే శివం’, మరియు అజిత్ తో ‘విలన్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కూడా నటించింది. ఇక ఈమధ్య కాలం లో హీరోయిన్ రోల్స్ కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేస్తుంది. సుందర్ సి దరసకత్వం లో తెరకెక్కిన ‘అంబలా’ మరియు మరియు కె భాగ్యరాజ్ దర్శకత్వం లో ‘ముత్తిన కత్తికిక్కై’ వంటి చిత్రాల్లో నటించింది.
అంతే కాదు ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ‘రవీనా టాండన్’ కి కజిన్ అవుతుంది, ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈమె,ప్రస్తుతం తన చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడం తో ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడూ అప్డేట్ గా ఉంటుంది. అంతే కాదు ఈమె అభిమానం ని కూడా వ్యాపారంగా చేసుకొని, డబ్బులు పోగు చేసుకుంటుంది. ‘కిరణ్’ అనే యాప్ ని క్రియేట్ చేసి, అందులో 49 రూపాయలతో వినియోగదారులు అయ్యే అవకాశం ని కల్పించింది.
అంతే కాదు ఆ యాప్ లో వినియోగదారులు వెయ్యి రూపాయిలు ఇస్తే రెండు హాట్ ప్రైవేట్ ఫోటోలు, మరియు వీడియో కాల్ లో 15 నిముషాలు మాట్లాడాలనుకుంటే 14 వేల రూపాయిలు, అలాగే 25 నిమిషాలు మాట్లాడాలంటే 25 వేల రూపాయిలు ఖర్చు అవుతుందట. ఇలా ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ కానీ, మీడియం రేంజ్ హీరోయిన్ కానీ చెయ్యలేదు. విక్రమ్ , కమల్ హాసన్ , అజిత్ లాంటి లెజెండ్స్ తో నటించిన కిరణ్ రాథోడ్ ఇప్పుడు ఇలా దిగజారిపోవడం ఆమె అభిమానులను ఎంతగానో బాధిస్తుంది.