జారిపోతున్న కొంగుతో రకుల్ ప్రీత్ సింగ్ కొంటె పోజులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు

- Advertisement -

టాలీవుడ్లో సినిమాలు చేసి స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్లు ఆ తర్వాత నెమ్మదిగా సౌత్ ఇండస్ట్రీని చుట్టేయడం ఆనవాయితీయే. ఇక సౌత్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటిన కథానాయికలు ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్కు వెళ్లడం కూడా పరిపాటే. ఈ కోవకు చెందిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ కుడీ.. కూడా టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్, శాండల్ వుడ్ వెళ్లిందన్నమాట. అయితే బాలీవుడ్కు వెళ్లగానే అక్కడి ఇండస్ట్రీ సాదరంగా స్వాగతం పలకదు. అక్కడ నిలదొక్కుకోవాలంటే కాస్త కష్టమే. కానీ రకుల్ సాధించింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్.. బాలీవుడ్లో మాత్రం సామాజిక అంశాలను స్పృశించే కంటెంట్ ఉన్న సినిమాలకే జై కొడుతోంది. అందులో భాగంగానే ఛత్రివాలీ, డాక్టర్ జీ వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు బీ టౌన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా బాలీవుడ్ రకుల్ ప్రీత్ సింగ్ను సాదరంగా ఆహ్వానించింది.

Rakul preet singh saree photos

ఇక అక్కడే సెటిల్ అయిన రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో పడింది. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతారని కొన్నాళ్ల నుంచి బీ టౌన్లో గుసగుసలు వినిపించాయి. కానీ తాజాగా ఈ జంట బ్రేకప్ అయినట్లు రూమర్స్ వినబడుతున్నాయి. ఇందులో ఎంత నిజముందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

- Advertisement -
Rakul preet singh saree Stills

ఈ రూమర్స్ మాట ఎలాగున్నా రకుల్ మాత్రం సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. వరుస ఈవెంట్లకు హాజరవుతూ డిఫరెంట్ ఔట్ఫిట్స్లో సందడి చేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా బోల్డ్ ఔట్ఫిట్స్లో ఘాటుగా అందాల ప్రదర్శన చేసిన రకుల్ తాజాగా ట్రెడిషనల్ ఔట్ఫిట్లో కనిపించింది. ఈసారి రకుల్ చీరకట్టులో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది. రకుల్ చీరకట్టులో కనిపించడం కాస్త అరుదనే చెప్పాలి. ముఖ్యంగా బీ టౌన్కు వెళ్లాక చీరకట్టులో కనిపించిందే లేదు.

Rakul preet singh saree Images

కానీ తాజాగా ఎల్లో కలర్ చీరలో సందడి చేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో రకుల్ పైట జారుతుండగా ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు. ఈ రేంజ్లో అందాల విందు వడ్డిస్తే ఎలా రకుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్తో తమ ప్రేమనంతా కామెంట్ బాక్సులో నింపేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here