రామ్ చరణ్ ‘కౌ బాయ్’ సినిమాకి ముహూర్తం ఫిక్స్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!

- Advertisement -

టాలీవుడ్ లో కౌ బాయ్ జానర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ప్రతీ అభిమాని తమ హీరో ని ఒక్కసారైనా ఆ గెటప్ లో చూడాలని కోరుకుంటారు, ఈ జానర్ ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ఆయన తీసిన కౌ బాయ్ జానర్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక చరిత్ర సృష్టించింది.

రామ్ చరణ్
రామ్ చరణ్

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘కొదమ సింహం’ అనే చిత్రం ద్వారా కౌ బాయ్ రోల్ వేసి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నాల్గవ చిత్రం ‘టక్కరి దొంగ’ లో కౌ బాయ్ గెటప్ వేసాడు, కానీ ఈ సినిమా అప్పట్లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.అయితే ఈ జానర్ లో హిట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని తెలుసుకున్న మన స్టార్ హీరోలు ఆ జానర్ జోలికి పోలేదు.

కొదమ సింహం
కొదమ సింహం

మిగిలిన హీరోలకు ఈ జానర్ కలిసి వచ్చినా రాకపోయినా మెగా ఫ్యామిలీ కి మాత్రం బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి.చిరంజీవి కొదమసింహం సినిమాతో హిట్ కొడితే, పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో ఒక పాటలో కౌ బాయ్ గెటప్ వేసి అభిమానులకు పిచ్చెక్కించాడు.సినిమాతో పాటుగా ఈ పాట కూడా అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన మొదటి సినిమాలోని ఒక పాటలో కౌ బాయ్ గెటప్ లో కనిపించి అలరిస్తాడు.

- Advertisement -

అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ పూర్తి స్థాయి కౌ బాయ్ రోల్ చేయబోతున్నాడట.ఇటీవలే ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, రామ్ చరణ్ కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ కౌ బాయ్ కథని వినిపించాడని, రామ్ చరణ్ కి ఆ కథ ఎంతగానో నచ్చిందని, ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి అయ్యాక ఈ చిత్రం చేస్తానని చెప్పాడట, ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు, 3 ఇడియట్స్ , పీకే వంటి సంచలనాత్మక చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ అట. ఎప్పటి నుండో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయ్యిందని అంటున్నారు కానీ, అది కౌ బాయ్ జానర్ లో తెరకెక్కే సినిమా అని మాత్రం ఈమధ్యనే తెలిసిందే, మరి రామ్ చరణ్ కౌ బాయ్ జానర్ తో పాన్ వరల్డ్ సినిమాని ఎలా షేక్ చెయ్యబోతున్నాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here