Genelia: హాహాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది జెనీలియా. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే జెనీలియా అంటే సినీ సెలబ్రిటీలకు కూడా చాలా ఇష్టం. సోషల్ మీడియాలో జెనీలియా తాజాగా కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. చాక్లెట్ కలర్ శారీలో మరాఠీ సంప్రదాయ బొట్టుతో జెనీలియా సందడి చేసింది.
ఈ ట్రెడిషనల్ డ్రెస్సులో ఈ భామ తన క్యూట్ స్మైల్‌తో అభిమానుల మనసు దోచేసింది. ఈ స్మైల్ కోసం తెలుగు తెర ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తోందంటూ తెలుగు కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. హాసిని టాలీవుడ్‌కు కమ్‌బ్యాక్ ఇచ్చేయ్ అంటూ తెగ రిక్వెస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఓ విషయం చెప్పడం మర్చిపోయా.. ఈ కుర్రాళ్ల రిక్వెస్టు జెనీలియాను చేరినట్టుంది. ఈ భామ ఇటీవల ఓ తెలుగు సినిమాకు సంతకం చేసింది. అయితే హీరోయిన్గా మాత్రం కాదు. హీరోకు సోదరిగా. ఏదేమైనా తెలుగు తెరపై జెనీలియాను మరోసారి చూడబోతున్నామన్నమాట.
ఈ బ్యూటీ బాయ్స్ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఎన్టీఆర్, రామ్, రానా వంటి యంగ్ హీరోలతో జతకట్టింది. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. తమకు కూడా హాసిని లాంటి గర్ల్‌ఫ్రెండ్ కావాలని అనుకోని కుర్రాడు ఉండడంటే నమ్మశక్యం కాదు. అంతలా ఆ పాత్రలో జెనీలియా ప్రేక్షుకలను అలరించింది. ఈ సినిమా తర్వాత ఈ భామ టాలీవుడ్లో సూపర్ హిట్ మూవీస్‌లో నటించి అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.
అక్కడ తన కోస్టార్ రితేశ్ దేశ్ముఖ్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఓ శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటైయింది. పెళ్లి.. వెనువెంటనే ఇద్దరు పిల్లలు. ఇక ఫ్యామిలీ లైఫ్‌తో క్షణం తీరికలేకుండా పోవడంతో జెనీలియా సినిమాలకు బైబై చెప్పేసి తన ఫోకస్ అంతా ఫ్యామిలీపైనే పెట్టింది. అప్పట్నుంచి ఇటు తెలుగు తెరకు.. అటు బాలీవుడ్ స్క్రీన్కు దూరమైపోయింది. ఇప్పుడు పిల్లలు కాస్త పెరిగి పెద్దయ్యారు. వాళ్లు స్కూల్‌కు వెళ్తున్నారు. అందుకే ఈ బ్యూటీ నెమ్మదిగా వెండితెరపైకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
ఇందులో భాగంగానే జెనీలియా బాలీవుడ్లో పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో ఓ క్రేజీ షోకు తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి హోస్టుగా వ్యవహరించింది. అలా నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన జెనీలియా ఇటీవల మజిలీ మరాఠీ రీమేక్ వేడ్ సినిమాలో తన భర్తతో కలిసి నటించింది. ఈ సినిమా మరాఠీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడి ప్రేక్షకులు రితేశ్, జెనీలియా జంటల కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు.