‘HIT’ ఫ్రాంచైజీలో పవర్‌ఫుల్‌ కాప్‌గా సమంత.. మైండ్ బ్లోయింగ్ ఐడియా అంటూ..

- Advertisement -

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో హిట్‌ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో డైరెక్టర్ దీనికి సీక్వెల్‌గా Hit – 2 తీశాడు. ఇది కూడా బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో హిట్-3కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అయితే ఇది మూడో పార్ట్‌ వరకే ఆగకుండా హిట్ ఫ్రాంఛైజీని వీలైనంత ఎక్కువ పార్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది Hit టీమ్. అయితే ఇప్పటిదాకా మొదటి రెండు పార్ట్‌లలో హీరోలదే టాప్ హ్యాండ్. థర్డ్ పార్ట్‌లోనూ హీరోదే కీలక పాత్ర అని సెకండ్ పార్ట్ క్లైమాక్స్‌లో తెలిసిపోయింది. అయితే తర్వాత వచ్చే సీక్వెల్స్‌లో హీరోయిన్లను చూస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. హిట్ యూనివర్స్‌లో సమంత పవర్ ఫుల్ కాప్‌గా నటిస్తే చూడాలని చాలా మంది భావిస్తున్నారు.

Samantha - HIT
Samantha – HIT

హిట్ ఫ్రాంచైజీ చర్చల్లో సమంత పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాని-శైలేష్‌ కొలను క్రియేట్‌ చేసిన `హిట్‌`సిరీస్‌ మంచి ఆదరణతో సాగుతోంది. `హిట్‌` సిరీస్‌ను ఏడు సినిమాలుగా `అవెంజర్‌` ఫ్రాంఛైజీ తరహాలో తీసుకురావాలని నాని, శైలేష్‌ ప్లాన్ చేస్తున్నారు. `హిట్‌3`ని కూడా అనౌన్స్ చేశారు. `హిట్‌2`లోనే మూడో పార్ట్ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా నటిస్తారని వెల్లడించారు. అడివిశేష్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఆల్‌రెడీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఏడు సినిమాల్లో ఇంకా నలుగురు హీరోలు ఎవరు నటిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

నేచురల్ స్టార్ నాని దీన్ని ఇండియా లెవల్‌లో సూపర్‌ హీరో సినిమాలా చేయాలనుకుంటున్న నేపథ్యంలో చివరి సినిమాలో ఏడుగురు హీరోలు దేశ వ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్‌ చేసేలా ప్లాన్‌ చేశారని సమాచారం. మరి అప్పటి వరకు ఈ సిరీస్‌ కొనసాగుతుందా. మధ్యలో రిజల్ట్ తేడా కొడితే అన్ని పార్ట్‌లు తీస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సంచలన అప్డేట్‌ వచ్చింది.

- Advertisement -

`హిట్‌` సిరీస్‌లో సమంత అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సిరీస్‌లో హీరోయిన్‌ మెయిన్‌ లీడ్‌గా ఎందుకు తీసుకోకూడదని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ఒకటి రెండు పార్ట్ ల్లో సమంత లాంటి హీరోయిన్‌తో మెయిన్‌ లీడ్‌గా చేస్తే బాగుంటుందని ఆ జర్నలిస్ట్ ట్వీట్‌ చేశాడు. దీనికి అడివిశేష్‌ స్పందించాడు. ఐడియా అదిరిపోయింది. మరి సమంత ఏమంటారని ప్రశ్నించారు.

దీనిపై సమంత రియాక్ట్ అయింది. ఏ చెడ్డ పోలీస్‌, వినడానికి సౌండ్‌ ఫన్నీగా ఉంది. హిట్‌ సూపర్‌ హిట్‌కి అభినందనలు. ‘అడివిశేష్‌ మీ విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను` అని పేర్కొంది సమంత. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా, ఇదొక క్రేజీ న్యూస్‌గా మారింది. ఐడియా వరకు అద్భుతంగా ఉండటంతో, నిజంగానే సమంతనే భాగమైతే సెన్సేషనల్‌ అవుతుందని చెప్పొచ్చు. ఫన్నీగా సాగిన చర్చ సీరియస్‌గా టర్న్ తీసుకుంటుందా? ఇంతటితో క్లోజ్‌ అవుతుందా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here