ప్రస్తుతం Ram Charan స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? రామ్ చరణ్ 3 నెలలు షూటింగ్ ల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. పుట్టబోయే బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఉపాసన డెలివరీ టైమ్ లో చరణ్ పక్కనే ఉండాలని షూటింగ్ లకు మూడు నెలలు గ్యాప్ ఇచ్చాడని అంటున్నారు. ఏ మహిళ అయిన తన డెలివరీ టైమ్ లో ఎవరు పక్కన ఉన్నా.. లేకున్నా కట్టుకున్న భర్త పక్కనే ఉండాలని కోరుకుంటారు. దాంతో ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఇంత ప్రేమ చూసిపిస్తున్న చెర్రీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉపాసనకు ప్రస్తుతం ఏడో నెల అని తెలిసిన విషయమే. ఇప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఉపాసన కోసం టైమ్ కేటాయించాలి అని అనుకుంటున్నాడట రామ్ చరణ్. అందుకే మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని.. ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్. ఇప్పటి నుంచే ఉపాసనకు సపోర్ట్ గా.. ఆమెతో పాటు ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట చరణ్. అయితే ఈ బ్రేక్ గేమ్ ఛేంజర్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.