Big Boss Arohi :బయటపడిన అసలు విషయం.. శాకుతలం ఫ్లాప్ వెనుక నాగచైతన్య

- Advertisement -

Big Boss Arohi : గుణ శేఖర్ దర్శకత్వంలో సమంతా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఇటీవలే ఈ సినిమా రిలీజై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎక్కడ కూడా ఈ సినిమా గురించి పాజిటీవ్ టాక్ రాకపోవడం విశేషం. నెగటివ్ రివ్యూలు, మిశ్రమ స్పందనతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ పేలవంగా ఉండడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. సమంతా కూడా ఈ సినిమాకి సూట్ అవ్వలేదనే వాదన కూడా వినిపించింది.

Big Boss Arohi
Big Boss Arohi

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆరోహి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి అక్కినేని అభిమానులే కారణమని తెలియజేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో వర్క్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆరోహి రావు (Arohi Rao).. బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఫేమ్ ని అందుకుంది. అప్పుడప్పుడు సినిమాలకు రివ్యూలు ఇస్తూ లైమ్ లైట్ లోకి వస్తుంటుంది. తాజాగా శాకుంతలం సినిమా గురించి చెప్పి ఒక్కసారిగా హైలెట్ అయింది.

Shaakuntalam

ఆరోహి మాట్లాడుతూ.. “శాకుంతలం చిత్రం కొంచెం లాగ్ ఉండడం నిజమే. పురాణాల గురించి తెలియని వారికి ఈ సినిమా పంచ తంత్రం కథలాగే కనిపిస్తుంది. ఈ చిత్రం ప్లాప్ అవ్వడానికి నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా ఒక కారణం. సమంత నటన బాగాలేదని చెప్పిన వారు నాగ చైతన్య అభిమానులే. ఉన్నది తీశారు కాబట్టే ఈ సినిమా ప్లాప్ అయింది. కొంచెం ఫిక్షన్, మసాలా జోడిస్తే ఈ సినిమా హిట్ పడేది. ఇక అల్లు అర్హ గురించి మాట్లాడుతూ.. అర్హ బాగా చేసింది. కానీ అంత కంటే బాగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here