Vishnupriya: విష్ణు ప్రియ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. పోవే పోరా షో తో ప్రేక్షకులకు పరిచయమైంది..అయితే ఆ షో తో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న పలు షో లలో కనిపించి బాగా ఫెమస్ అయ్యింది.. గత కొన్ని రోజులుగా షోలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. ఈ మధ్య హాట్ ఫొటోలతో ఓ రేంజు లో కుర్రాళ్లకు హీటేక్కిస్తుంది… తాజాగా మరో పోస్ట్ పెట్టి నెట్టింట దుమారం రేపుతుంది..
తనకు ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని నేరుగా తన మనసులో ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ బయటపెట్టి షాకిచ్చింది. దీంతో ఈ విషయం వైరల్ అవుతోంది…బాలీవుడ్ జోడీ రణబీర్ కపూర్, అలియా భట్ లేటెస్ట్ వీడియో వైరల్ కాగా దాన్ని విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆలియా భట్, రణబీర్ కపూర్ మ్యారేజ్ సందర్బంగా వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు..ఈ పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా వీళ్ళ కారును అభిమానులు చుట్టుముట్టి.. బయట ఉన్న ఫ్యాన్స్ అందరికి రణబీర్ కపూర్ కరచాలనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో అలియా భట్ తన భర్తని ప్రేమగా ముద్దు పెట్టుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
తాజాగా ఈ ముద్దు పై విష్ణు క్రేజీగా రియాక్ట్ అయ్యింది..దేవుడా ఇలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడు ఇస్తామంటూ బోల్డ్ గా కామెంట్ చేసింది. ఇది చూసి మరీ అంత విరహం తట్టుకోలేకపోతే పెళ్లి చేసుకో అని ఆమెకు సలహాలు ఇస్తున్నారు నేటిజన్లు..సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ షేక్ చేస్తుంది..బుల్లితెరపై నే కాకుండా వెండి తెరపై కూడా మెరిసింది..ఇటీవలే ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా కూడా చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తు వస్తుంది..