Inaaya Sulthana : అయ్యోపాపం.. బిగ్ బాస్ ఇనయా కూడా ఆ నరకాన్ని అనుభవించిందా..!!

- Advertisement -

చిత్ర పరిశ్రమలో ఉండాలంటే కేవలం అవకాశాలు వస్తే సరిపోదు.. అందుకు తగ్గట్లు టాలెంట్ కూడా ఉండాలి… కొన్ని అవకాశాలు కేవలం ఒకటి, రెండు సినిమాలకు మాత్రం పనికి వస్తుంది. తర్వాత మళ్ళీ అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న వారంతా ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేక రోడ్ల మీద వుండే టాప్ ల దగ్గర నీళ్ళు తాగి బ్రతికిన వారే.. ఇలా అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా ఉన్నారు. తమ టాలెంట్ ను జనాలకు చూపించి అందరి ముందు గర్వంగా నిలబడాలని కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళు ఎందరో.. అందులో బిగ్ బాస్ బ్యూటీ Inaaya Sulthana కూడా ఒకటి.

Inaaya Sulthana
Inaaya Sulthana

తన అందంతో ఆకట్టున్న ఇనయా జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని అంటున్నారు..ఆ లైఫ్ లోని కష్టాలను వింటే మనిషి అన్న ఎవరైనా కంటతడి పెడతారు..బాధలు అనడం కన్నా ఒక నరకం నుంచి బయట పడి ఇప్పుడు బిగ్ బాస్ లో కొనసాగుతుంది. హౌస్ లో ఆమె ఆట తీరు అన్నీ ప్రేక్షకులకు నచ్చాయి.. దాంతో ఆమెకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.అందుకే 13 వ వారంలో కూడా కొనసాగుతుంది..

బిగ్ బాస్ లోకి రాకముందు ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్యూ ఇచ్చింది.అందులో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది.. ఇంట్లో అడిగితే ఒప్పుకోలేదు. దాంతో వంద రూపాయలు చేతిలో పట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి నగరి నుంచి తిరుపతి చేరుకున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ దగ్గర ఉండి, చిన్న చిన్న జాబులు చేస్తూ కాలం వెల్లబుచ్చింది.అయితే ఇండస్ట్రీకి రావాలని నా కల..దాని గురించి ఎవరికీ చెప్పిన పెద్దగా పట్టించుకోలేదు. నా కుటుంబ సభ్యులే కాదు..నా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చెయ్యలేదూ..అయినా నా ఆలోచన మార్చుకోలేదు..

- Advertisement -

అలా తిరుపతి నుండి హైదరాబాద్ కి వచ్చి.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా నాకు తెలియదు. అయినా పట్టుదలతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరు నెలలుకు అవకాశాలు వచ్చాయి. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. బుజ్జి ఇలా రా, ఏవం జగత్ వంటి సినిమాలలో నటించాను.

ప్రస్తుతం మరో మూడు ప్రాజెక్ట్ లలో చేస్తున్నాను. ఒకప్పుడు నవ్విన వాళ్ళే ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు.. ఒక విధంగా సంతోషంగా ఉన్నా, నా వల్లే కుటుంబ పరువు పోతుందని నా పేరెంట్స్ అంటుంటే భాధగా ఉందని ఇనయా చెప్పుకొచ్చింది..ఇప్పుడు బిగ్ బాస్ లో గెలిస్తే తన పేరెంట్స్ దగ్గరకు వస్తారేమో చూడాలి..ఏది ఏమైనా బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని కోరుకుందాం.. ఇనయా ఇంటర్యూ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here