Rashmika Mandanna : సమంత బాటలో రష్మిక.. మహేశ్ తో కలిసి స్పెషల్ సాంగ్

samantha rashmika mandanna


నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ  ఫుల్ జోష్ మీద ఉంది. పుష్ప మూవీతో Rashmika Mandanna రేంజ్ పాన్ ఇండియా లెవల్ కు వెళ్లింది. ఇక బాలీవుడ్ లోనూ ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. గుడ్ బై మూవీతో బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఎనిమల్, మిషన్ మజ్ను మూవీస్ తో త్వరలోనే సందడి చేయనుంది. మరోవైపు పుష్ప-2 షూటింగ్ లోనూ బిజీగా ఉంది.

చాలా మంది హీరోయిన్లు స్టార్ డమ్ వచ్చిన తర్వాత సినిమాల ఎంపికలో కాస్త వైవిధ్యాన్ని చూపిస్తారు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలు తీసేందుకు డేర్ చేస్తారు. ఈ బాటలో అనుష్క, సమంత ఫుల్ జోష్ తో సినిమాలు చేశారు. సమంత అయితే కాస్త డేరింగ్ చేసి ఐటెం సాంగ్ లోనూ నటించింది. ఇప్పుడు అదే బాటలో నేషనల్ క్రష్ రష్మిక కూడా చేరుతోందట. ఈ బ్యూటీ కూడా ఓ ఐటెం సాంగ్ లో నటించ బోతోందట.

రష్మిక మందన్నా ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందని సమాచారం. సూపర్‌ స్టార్‌ మహేశ్ తో ఆమె స్పెషల్‌ సాంగ్ కు స్టెప్పులేయబోతుందట. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే మహేశ్ సినిమాలో రష్మిక మందన్నా స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందని లేటెస్ట్ టాక్‌.

samantha rashmika mandanna
samantha rashmika mandanna

మహేశ్ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నామని, అది గుర్తిండిపోయేలా చేయాలనుకుంటున్నామని, అయితే త్రివిక్రమ్‌ని ఒప్పించే పనిలో ఉన్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. జనరల్‌గా త్రివిక్రమ్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌లు ఉండవు. మొదటిసారి ఆయన నిర్మాతల ఒత్తిడి మేరకు స్పెషల్‌ సాంగ్‌ పెట్టబోతున్నారట. ఈ సాంగ్ కు ప్రొడ్యూసర్ రష్మికను తీసుకుందామనుకున్నారట. 

రష్మిక మందన్నకు ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ లలో ఉన్న క్రేజే వేరు. ఇక కుర్రకారు ఈ బ్యూటీ గ్లామర్ కు ,క్యూట్ నెస్ కు ఫిదా. అందుకే రష్మికతో ఐటెం సాంగ్ చేయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని చిత్రబృందం భావిస్తోందట. ప్రస్తుతం రష్మికతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. మరి రష్మిక ఒప్పుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మహేష్‌, రష్మిక కలిసి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.