Akkineni Amala : అన్ని వేల కోట్లు ఉన్న అక్కినేని అమల బంగారాన్ని ఎందుకు వేసుకోదో తెలుసా?

- Advertisement -

Akkineni Amala గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో మెరిసింది..పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అమల ఓ తమిళ సినిమాతో సినీ ఫీల్డులోకి వచ్చారు. ఆ తరువాత నాగార్జున నటించిన ‘చినబాబు’ సినిమాలో తొలిసారి తెలుగులో అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి చేసిన ‘శివ’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు అఖిల్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు దూసుకెళ్తున్నాడు.. అయితే ఈవిడకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో అందరికి తెలుసు.. కానీ అమల ఎప్పుడూ ఆడంబరాలకు పోదు.. చాలా సింపుల్ గా ఉంటుంది.. అస్సలు బంగారం పెట్టుకోదు.. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

Akkineni Amala
Akkineni Amala

అమల కంటే ముందే నాగార్జున డి.రామానాయుడు కూతురు శ్రీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగచైతన్య పుట్టాడు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఆ తరువాతే అమలను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య, అమల, అఖిల్ అంతా కలిసే ఉంటారు. అమల ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్ట్టార్ చేశారు. ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో శర్వానంద్ కు తల్లిగా నటించారు. ఇందులో ఏజ్ ఎక్కువైనట్లు కనిపించినా ఆమె పాత్రకు ప్రాధాన్యం పెరిగింది..

సినిమాల్లోనే కాకుండా అమల కొన్ని సందర్భాల్లో ఇతర కార్యక్రమాల ద్వారా బయట కనిపిస్తూ ఉంటారు. జంతు ప్రేమికురాలు అయినందున పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె మెడలో నల్లపూసల దండ తప్ప బంగారం ఎక్కడా కనిపించదు. ఎందుకు? అని చాలా మంది ఆరా తీయగా.. అక్కినేని అమలకు స్కిన్ అలర్జీ ఉందట. ఆమె ఏ ఆభరణం ధరించినా ఆమె ముఖం ఎర్రగా మారుతుందని చెబుతున్నారు..అందుకే ఎక్కువగా నగలను ధరించరు అని ఓ సందర్బంలో ఆమె చెప్పినట్లు సమాచారం.. ఇది అసలు మ్యాటర్ అన్నమాట.. ప్రస్తుతం ఆమె సోషల్ కార్యక్రమాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here