Manchu Vishnu : జనాలను ఫూల్స్ చేస్తూ కాలం గడిపేస్తున్న మంచు కుటుంబం.. వీళ్ళు ఈ జన్మకి మారారా?

- Advertisement -

Manchu Vishnu : సోషల్ మీడియా లో ఎప్పుడూ ట్రోలింగ్ కి గురయ్యే ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది మంచు ఫ్యామిలీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో వీరి పై ట్రోలింగ్స్ జరుగుతూ ఉండేవి కానీ, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం మంచు విష్ణు పై మరియు మంచు మోహన్ బాబు పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోలింగ్స్ జరిగాయి. మంచు విష్ణు అప్పట్లో చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉండేవి. ఈ కుటుంబం మీద సోషల్ మీడియా లో ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. అలా తింగరి తనంతో మాట్లాడితే కచ్చితంగా ఎవరైనా ట్రోల్ల్స్ చేస్తారు. కానీ మంచు విష్ణు అనేది ఏమిటంటే ‘మా మీద ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకునే ఒక అతను ఉద్యోగస్తులను పెట్టిమరీ ట్రోల్ల్స్ చేయిస్తున్నారని. అతను ఎవరో మీకు ఈపాటికే అర్థం అయ్యుండాలి’ అంటూ చిరంజీవి కుటుంబాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసాడు.

Manchu Vishnu
Manchu Vishnu

ఆయన చేసిన ఆ ఆరోపణలను ఎవ్వరూ పట్టించుకోలేదు అనుకోండి అది వేరే విషయం.!, కానీ మంచు కుటుంబం ఇప్పటికైనా జనాల్లో మనం కామెడీ అయిపోతున్నాం అనే విషయాన్నీ గ్రహించడం లేదు.మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఆరోపిస్తున్నది ఇదే. రీసెంట్ గా మంచు మనోజ్ సోషల్ మీడియా లో విష్ణు తన పై దాడి చెయ్యడానికి వచ్చాడంటూ ఒక వీడియో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసాడు.ఆ వీడియో సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఇదంతా నిజమేనేమో అని అనుకున్నారు. వాస్తవానికి అది నిజమే, కానీ మంచు విష్ణు పబ్లిక్ లో జరిగిన ఇమేజ్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి,అది మేము త్వరలో తియ్యబోతున్న ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాలిటీ షో కి సంబంధించిన వీడియో అని, ఇప్పుడు టీజర్ ని విడుదల చేస్తున్నాం అంటూ ఒక టీజర్ ని వదిలాడు. దీనిపై నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Manchu Vishnu and Manoj

జనాలకు మీ సమస్యలను పట్టించుకోవడం కంటే ఎక్కువ పనులు లేవు అని అనుకుంటున్నారా..?, అసలు జనాలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో మంచు కుటుంబం పై విరుచుకుపడుతున్నారు.ఇలాంటి చీప్ వేషాలు వేసి ఆ తర్వాత ట్రోలింగ్స్ జరిగితే అన్యాయం గా ఇంకొకరు చేస్తున్నారు అంటూ ఆరోపించడం, ఇలాంటి చేష్టలు చేస్తే ఎదో ఒక రోజు జనం రోడ్ల మీదకి వచ్చినప్పుడు కొడుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు నుండి వచ్చిన ఈ వీడియో కి మంచు మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.ఈయనకి కొద్దిగా సోషల్ మీడియా లో మంచి పేరు ఉంది, మంచు కుటుంబం లో అందరికంటే మంచోడు అనే పేరు కూడా ఉంది.ఈయన కూడా ఇప్పుడు ‘హౌస్ ఆఫ్ మంచు’ లో భాగంగానే చేసాము అని చెప్తే మాత్రం ఇతని మీద కూడా జనాల్లో గౌరవం పోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here