Ram Charan : RRR సినిమా తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రామ్ చరణ్ మేనియా నే కనిపిస్తుంది.ఇదెక్కడి క్రేజ్ రా బాబు అని విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘ఆరెంజ్’ సినిమా స్పెషల్ షోస్ వేసుకున్నారు.

దీనికి ఇండస్ట్రీ హిట్ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, అలాంటి రెస్పాన్స్ వచ్చింది.గ్లోబల్ స్టార్ గా ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో చెప్పకనే చెప్పింది ఈ చిత్రం.అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ తానూ భవిష్యత్తులో చెయ్యబొయ్యే సినిమాలను కూడా సెట్ చేసుకున్నాడు.ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్,ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా,మరియు సుకుమార్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ సినిమాలతో పాటుగా ఆయన బాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ క్రేజ్ దక్కించుకున్న రాజ్ కుమార్ హిరానీ తో ఒక సినిమా చేయబోతున్నాడట.మున్నా భాయ్ MBBS , లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్ , పీకే మరియు సంజు వంటి సంచలనాత్మక సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ , రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన షారుఖ్ ఖాన్ తో ‘దుంకీ’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ చితం తర్వాత ఆయన చెయ్యబొయ్యే సినిమా ఇదేనట.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నెల నుండే మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందే రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు, ఇప్పుడు ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే సినిమాని లైన్ లో పెట్టాడు. ఈ చిత్రం తర్వాత ఆయన రేంజ్ బాలీవుడ్ లో ఖాన్స్ తో సరిసమానంగా చేరిపోతుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్.